విజయ్ దేవరకొండ - రష్మికల్లో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఏళ్ల తరబడి దాగుడుమూతలు ఆడిన ఈ ప్రేమ పక్షులు, ఇప్పుడు పెళ్లి బంధంతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. అసలు వీరిద్దరిలో 'ఐ లవ్ యు' అని ముందు చెప్పింది ఎవరు? అని అభిమానులను తొలిచేస్తుంటుంది. ఆ సస్పెన్స్ కు తెర దించేస్తూ విజయ్ దేవరకొండ విషయాన్ని చెప్పేశారు.

ముద్దుగా విజ్జు అని పిలుస్తుంది

2018లో 'గీత గోవిందం' సెట్స్‌పై మొదలైన వీరి పరిచయం, 'డియర్ కామ్రేడ్' నాటికి గాఢమైన స్నేహంగా మారింది. తెరపై వీరి కెమిస్ట్రీ ఎంత పండిందో, నిజ జీవితంలోనూ అంతే వేగంగా మనసులు కలిశాయి. సాధారణంగా అబ్బాయిలు ముందుగా ప్రపోజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఆ పద్ధతికి రష్మిక చెక్ పెట్టింది. తన మనసులో ఉన్న ప్రేమను ఏమాత్రం దాచుకోకుండా, విజయ్ కంటే ముందే ఆమె తన ఇష్టాన్ని వ్యక్తపరిచింది. ముందుగా ప్రపోజ్ చేసింది. వాస్తవానికి అమ్మాయిలు ప్రపోజ్ చేయడానికి కాస్త వెనకాడతారు. విజయ్‌ని తను ఎంతగా ప్రేమిస్తుందో, అది స్నేహానికి మించిన అనుబంధమని ఆమెకు ముందే అర్థమైంది. అందుకే ఆలస్యం చేయకుండా తన మనసులో మాటను 'విజ్జు' ముందు ఉంచింది. రష్మిక ముద్దుగా విజ్జు అని పిలుస్తుంది. ఆమె కళ్లల్లో ఉన్న నిజాయితీని, ఆరాధనను చూసిన విజయ్, ఏమాత్రం ఆలోచించకుండా ఆమె ప్రేమకు పచ్చజెండా ఊపేశాడు.

Vijay Deverakonda Do you know who proposed first between him and Rashmika Mandanna

రష్మిక పేరు చెప్పిన విజయ్

ఇన్నాళ్లూ మీడియా అడిగిన ప్రశ్నలకు దాటవేస్తూ వచ్చిన ఈ జోడీ, పెళ్లి తర్వాత అసలు నిజం చెప్పేసింది. "ముందు ఎవరు ప్రపోజ్ చేశారు?" అన్న అభిమానుల ప్రశ్నకు విజయ్ నవ్వుతూ రష్మిక పేరు చెప్పాడు. ఆమె ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా తన ప్రేమను చెప్పడం వల్లే ఈరోజు తాము ఇలా ఉన్నామని వెల్లడించాడు. వీరి పెళ్లి వేడుకలు, సంగీత్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కేవలం సెలబ్రిటీల మధ్యే కాకుండా, తమ అభిమానులను కూడా భాగస్వాములను చేస్తూ వీరు ఏర్పాటు చేసిన 'పెళ్లి విందు' అందరి మనసులను గెలుచుకుంది.

స్వయంగా అభిమానులకు వడ్డించి, వారితో ముచ్చటించడం ద్వారా విజయ్-రష్మిక రియల్ లైఫ్ లోనూ 'బెస్ట్ జోడీ' అనిపించుకున్నారు. దేవాలయాల్లో అన్నదానం చేశారు. సొంత ఊరిలో అన్నదానం చేశారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు తమ పెళ్లికానుక సందర్భంగా ఉపకార వేతనాలిచ్చారు. ఈ జోడీ కలకాలం సంతోషంగా కాపురం చేసుకోవాలని, కలిసివుండాలని అభిమానులంతా కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+