• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్స్‌ నివారణకు ఆ జ్యూస్ తాగడం బెస్ట్: మోస్ట్ పాపులర్ ట్రీట్‌మెంట్‌గా

|
Google Oneindia TeluguNews

వయసు పెరిగే కొద్దీ చాలామందికి మూత్రనాళ ఇన్ఫెక్షన్స్‌ సంభవిస్తుంటాయి. కొందరు యుక్త వయస్కుల్లో ఉన్న వారికి కూడా మూత్రనాళ సంబంధ సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్‌ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. బ్యాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించడం దీనికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. మంచినీళ్లు సమయానికి తగినంతగా తాగకపోయినా గానీ, కిడ్నీల్లో రాళ్లు చేరడం ద్వారా గానీ, మూత్రాశయం, మూత్రనాళంలో ఏవైనా క్రిములు చేరినా ఇన్ఫెక్షన్స్‌ వస్తుంటాయి.

మూత్రనాళ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఇలా..

మూత్రనాళ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఇలా..

దీనివల్ల మూత్రంలో మంట, నొప్పి తలెత్తుతుంటుంది. మాటిమాటికీ మూత్రానికి వెళ్లాలనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో మూత్రం రంగు కూడా మారుతుంటుంది. ఇన్ఫెక్షన్‌ తీవ్రం అయినప్పుడు జ్వరం, ఒంటి నొప్పులు, సరిగ్గా కూర్చోలేకపోవడం వంటి పలు లక్షణాలు కనిపిస్తుంటాయి. మూత్రనాళంలో ఏర్పడే సమస్యలను నివారించడానికి అవసరమైన వైద్యం అందుబాటులో ఉంది. డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీబయోటిక్స్‌ వాడటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడొచ్చు.

క్రాన్ బెర్రీ జ్యూస్..

క్రాన్ బెర్రీ జ్యూస్..

రోజూ కనీసం రెండు లీటర్ల మంచినీళ్లు తాగటం, మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా దాన్ని విసర్జించడం వంటి చర్యలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కాగా- దీర్ఘకాలం పాటు మూత్రనాళ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడే వారు తరచూ క్రాన్‌బెర్రి రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. క్రాన్‌బెర్రి పండ్లను జ్యూస్‌గా తీసుకోవడం ద్వారా మూత్రనాళ సమస్యలను త్వరగా అధిగమించవచ్చని అంటున్నారు.

మోస్ట్ పాపులర్ ట్రీట్‌మెంట్

మోస్ట్ పాపులర్ ట్రీట్‌మెంట్

మూత్రనాళ సంబంధ వ్యాధులను నివారించడానికి చేసే ట్రీట్‌మెంట్‌లో క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను మోస్ట్ పాపులర్ ట్రీట్‌మెంట్‌గా చెబుతుంటారు డాక్టర్లు. ఈ పండ్లల్లో ఉండే ఫెనోలిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్‌కు మూత్రనాళ సమస్యలను నివారించే గుణం ఉందని నిర్ధారించారు. మూత్రనాళంలో తిష్టవేసిన బ్యాక్టీరియాలను నిర్మూలించడం, మంటను తగ్గించడం, బ్లాడర్, గ్యాస్ట్రోఇన్‌టెస్టినల్స్ ట్రాక్ట్స్‌లో నెలకొన్న ఇబ్బందులను తొలగించడంలో క్రాన్‌బెర్రీ జ్యూస్ అద్భుతంగా పని చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

శాస్త్రీయబద్ధంగా నిరూపితం..

శాస్త్రీయబద్ధంగా నిరూపితం..

మూత్రనాళ సమస్యలతో బాధపడుతున్న 1,498 మంది మహిళలపై నిర్వహించిన సర్వే సందర్భంగా ఈ విషయం రుజువైందని డాక్టర్లు పేర్కొంటున్నారు. క్రాన్‌బెర్రీ రసాన్ని తీసుకోవడం ద్వారానే మూత్రనాళ సంబంధ సమస్యలు తగ్గిపోయినట్లు తెలిపారు. మూత్రనాళ ఇబ్బందుల వల్ల కృత్రిమంగా క్యాథెటెర్‌ను అమర్చుకోవడానికి గైనకాలాజికల్ సర్జరీలను చేయించుకున్న మహిళల్లో ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్‌ను నివారించగల శక్తి ఈ క్రాన్‌బెర్రీ జ్యూస్‌కు ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు.

240 నుంచి 300 ఎంఎల్

240 నుంచి 300 ఎంఎల్

మూత్రనాళ సమస్యలతో బాధపడుతున్న వారు క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను ప్రతిరోజూ 240 నుంచి 300 మిల్లీలీటర్ల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. 24 వారాల పాటు ఈ జ్యూస్‌ను తీసుకున్న 373 మంది మహిళలు ఈ యూరినరి ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి పూర్తిగా బయటపడినట్లు ఓ సర్వేలో తేలింది. కొన్ని మెడికల్ అండ్ హెల్త్ జర్నల్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోన్నాయి. పొడి రూపంలో క్రాన్‌బెర్రీని వాడాలనుకునే వారు ప్రతిరోజూ 200 నుంచి 500 మిల్లీ గ్రాముల మేరకు తీసుకోవాల్సి ఉంటుంది.

  Covid-19 Third Wave Likely In August India To See 1 Lakh Cases Daily Says ICMR Scientist
  ఏపీలోనూ సాగు..

  ఏపీలోనూ సాగు..

  క్రాన్‌బెర్రీలు కెనడా తూర్పు ప్రాంతంలో విరివిగా కనిపిస్తాయి, ఇంగ్లాండ్ ఈశాన్య ప్రాంతంలోనూ దీన్ని ఎక్కువగా పండిస్తారు. భారత్‌లో కొన్ని ఏటవాలు ప్రాంతాల్లో దీన్ని పండిస్తారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లో ఇది విరివిగా పండుతుంది. మన రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాల్లో మాత్రమే దీన్ని సాగు చేస్తారు.

  చూడ్డానికి పచ్చి కాఫీ గింజల తరహాలో కనిపిస్తుంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. గుండెపోటు బారిన పడకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. హృదయనాళ సంబంధ ఇబ్బందులను నివారిస్తుంది. ఫైబర్, మాంగనీస్, విటమిన్ సీ, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి ఇందులో.

  English summary
  If you get frequent urinary tract infections, you have probably been told to drink cranberry juice and that it’s effective at preventing and treating these uncomfortable infections.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X