సీఎం రమ్మంటాడు. సీఎస్ వద్దంటాడు: ఏపీలో ఐఏఎస్‌ల పరిస్థితిపై మీ కామెంట్ ఏంటి?
అమరావతి : ఏపీలో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తీరు ఐఏఎస్‌లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై సమీక్షలకు రావాలనడం, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మాత్రం అందుకు అంగీకరించకపోవడం వారిని ఇబ్బందుల్లో పడేసింది. ఈ క్రమంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నెల రోజుల్లో ఏం చేయాలన్న దానిపై అధికారులకు అర్థం కావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి, తటస్థంగా ఉంటూనే పాలనను ఎలా సాగించాలన్నదానిపై ఐఏఎస్‌లు తర్జన భర్జనలుపడుతున్నారు.
ఇదే అంశంపై చర్చించేందుకు మంగళవారం విజయవాడలో ఐఏఎస్ అధికారుల సంఘం భేటీ కావాలని నిర్ణయించింది. అయితే కోరం లేకపోవడంతో వాయిదా పడింది. 184మందికి గాను 46మంది మాత్రమే హాజరుకావడంతో త్వరలోనే మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుతో ఐఏఎస్‌లు పడుతున్న ఇబ్బందులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.













Click it and Unblock the Notifications