కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల్లో మోడీకి క్లీన్‌చిట్ ఇవ్వడంపై ఈసీ సభ్యుల్లో బేధాభిప్రాయాలపై మీ కామెంట్ ఏంటి?

ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీకి ఎలక్షన్ కమిషన్ వరుసగా క్లీన్ చిట్‌‌లు ఇవ్వడంపై దూమారం రేగుతోంది. కమిషన్ సభ్యుల్లో ఒకరు దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారన్న వార్తలు వివాదాన్ని మరింత పెంచాయి. ఏప్రిల్ 1న వార్దాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తుండటంపై విమర్శలు గుప్పించడం, ఏప్రిల్ 9న లాతూర్ భలో ప్రధాని పుల్వామా, బాలాకోట్ ఘటనల్ని ప్రస్తావించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మోడీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.

ప్రధాని మోడీపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఈ రెండు ప్రసంగాల్లో ప్రధాని మోడీ కోడ్ ఉల్లంఘించలేదని ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లలో ఒకరైన అశోక్ లావాసా వ్యతిరేకించారన్న వార్తలు వస్తున్నాయి. ఆయన మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Share your opinion on Split view in EC over clean chit to PM Narendra Modi

అయితే ఎన్నికల సంఘం చట్టం ప్రకారం మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మరో కమిషనర్ అభిప్రాయం మేరకు 2:1 ప్రాతిపదికన మోడీకి క్లీన్ చిట్ ఇచ్చారు. మోడీ కోడ్ ఉల్లంఘన విషయంలో ఎలక్షన్ కమిషన్‌లో బేధాభిప్రాయాలు తలెత్తడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+