వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రగిరిలో రీపోలింగ్‌ నిర్ణయంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంపై మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

ఏపీలో మ‌రోసారి రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో అయిదు పోలింగ్ బూత్‌ల పరిధిలో రీ పోలింగ్‌కు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన వైసీపీ మ‌రో రెండు చోట్ల రీ పోలింగ్‌కు డిమాండ్ చేస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం రీపోలింగ్‌పై అభ్యంతరం చెబుతోంది. సీఈసీకి కలిసి ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

చంద్ర‌గిరిలో అవకతవకలు జరిగిన ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపించాలని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఈసీ ఐదు చోట్ల మాత్రమే అనుమతి ఇవ్వడంపై వైసీపీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. మిగిలిన రెండు కేంద్రాల్లోనూ మళ్లీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది.

TDP alleges EC decision on repolling in chandragiri is unethical, unconstitutional

ఇదిలాఉంటే పోలింగ్ ముగిసిన నెల రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించడంపై టీడీపీ మండిపడుతోంది. తమ అభ్యంతరాలను పట్టించుకోని ఎన్నికల సంఘం వైసీపీ ఫిర్యాదులపై మాత్రం వెంటనే స్పందిస్తోందని ఆరోపించింది. ఈసీ తీరుకు నిరసనగా...టీడీపీ శ్రేణులు తిరుప‌తిలో ఆందోళ‌న‌కు దిగాయి. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమైన తెలుగుదేశం నేతలు 32 రోజుల తర్వాత రీ పోలింగ్ నిర్వహించడం ఏంటని ప్రశ్నించింది. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఈసీఓకు లేఖ పంపారని, దీంతో రీపోలింగ్ ఆదేశాలు వచ్చాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే పోలింగ్ బూత్‌లలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాతే ఈసీ తమ ఫిర్యాదుపై స్పందించిందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మొత్తమ్మీద రాజకీయవేడిని పెంచిన చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

English summary
TDP alleges EC decision on repolling in chandragiri is unethical, unconstitutional
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X