వైసీపీ గెలిస్తే మాత్రమే ఈవీఎంలను అనుమానించాలన్న టీడీపీ నేత హరిప్రసాద్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఈవీఎంలను అనుమానించాలన్న టీడీపీ నేత హరిప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్న ఆయన.. ఈవీఎంలలో లోపాల గురించే పోరాటమని చెప్పారు. వైసీపీ గెలుపునకు ఈవీఎంల పనితీరును మడిపెడుతూ టీడీపీ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్ చేసిన కామెంట్లు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ గెలిస్తే ఈవీఎంలు మేనేజ్ కాలేదని, వైసీపీ గెలిస్తే మాత్రం ఈవీఎంలను మేనేజ్ చేసినట్లు భావించాల్సి ఉంటుందని చెప్పడం ద్వారా ప్రజలకు ఏ ఎలాంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారన్న దానిపై చర్చ సాగుతోంది.

ఇంటర్వ్యూలో భాగంగా హరిప్రసాద్ ఈవీఎంలను ఎవరైనా మేనేజ్ చేయవచ్చని, అందుకే 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఈవీఎంల పనితీరుపై కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. అయితే ఈసీ మాత్రం టీడీపీ నుంచి హరిప్రసాద్ బదులు మరో నిపుణుడిని పంపాలని సూచించింది. హరిప్రసాద్‌పై ఈవీఎం చోరీ కేసు ఉన్నందున అతనితో చర్చించలేమని చెప్పడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో వైసీపీ గెలిస్తే మాత్రమే ఈవీఎంలను అనుమానించాలన్న హరిప్రసాద్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.












Click it and Unblock the Notifications