అభ్యర్థులకు అలర్ట్.. నీట్ పీజీ 2024 మెరిట్ లిస్ట్ విడుదల..
నీట్ పీజీ 2024 పరీక్షలు రాసిన అభ్యర్థులకు అలర్ట్.. నీట్ పీజీ మెరిట్ లిస్ట్ విడుదలయ్యాయి. 50 శాతం ఏఐక్యూ సీట్లకు సంబందించి ఎన్‌బీఈఎంఎస్ తాజాగా మెరిట్ లిస్ట్ని విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు నీట్ పీజీ మెరిట్ లిస్ట్ని నీట్ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోగలరని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను natboard.edu.in, nbe.edu.in సంప్రదించగలరు.
నీట్ పీజీ 2024 పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 11వ తేదిన నిర్వహించారు. అదే నెల 23 వతేదిన ఎన్బీఈఎంఎస్ నీట్ పీజీ ఫలితాలను కూడా వెలువరించింది. ఇక, ఎండీ/ఎంఎస్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు/పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్బీ/డైరెక్ట్ ఆరేళ్ల డీఆర్ఎన్బీ కోర్సులు, ఎన్బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులకు సంబంధించిన ఏఐక్యూ సీట్ల మెరిట్ జాబితాను వేర్వేరుగా విడుదల చేయనున్నట్లు బోర్డు తెలిపిన సంగతి తెలిసిందే.

ఆయా సీట్లకు సంబంధించి ఆన్లైన్ కౌన్సిలింగ్కి అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఆల్ ఇండియా కోటా స్కోర్కార్డ్స్ని సెప్టెంబర్ 10వ తేది లేదా ఆ తర్వాత ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. ఇక, తాజాగా వీటికి సంబంధించిన మెరిట్ జాబితాను బోర్డు విడుదల చేసింది. త్వరలోనే అఖిల భారత కోటా సీట్ల నీట్ పీజీ కౌన్సెలింగ్ కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. త్వరలోనే mcc.nic.in తేదీన పూర్తి షెడ్యూల్ను కూడా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మెరిట్ జాబితాను చెక్‌చేసుకునే విధానం..
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి natboard.edu.in వెళ్లి చెక్ చేసుకోగలరు. ఆ తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన నీట్ పీజీ ఏఐక్యూ మెరిట్ లిస్ట్ చెక్ చేసుకునేందుకు లింక్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓ పీడీఎఫ్ మీ డిస్‌ప్లేపై కనిపిస్తోంది. ఆ తర్వాత రిజల్ట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. 50శాతం ఏఐక్యూ సీట్ల కోసం మీ ర్యాంకును చెక్ చేసుకోగలరు. భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింటౌట్ తీసుకోవడం లేదా డౌన్‌లోడ్ చేసుకోగలరు.












Click it and Unblock the Notifications