APPSC: 2018 గ్రూప్ 1 వ్యవహారంలో మరో మలుపు-హైకోర్టు సమీక్ష కోరిన ఏపీ సర్కార్..!
ఏపీలో ఏపీపీఎస్సీ 2018 లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష వ్యవహారం మరో మలుపు తిరిగింది. 2018లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష జవాబు పత్రాల్ని రెండుసార్లు మూల్యాంకనం చేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తిరిగి హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ఇవాళ పిటిషన్ దాఖలు చేసింది.
2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ఓసారి చేసిన తర్వాత తప్పిదాలు జరిగాయన్న కారణంతో ఏపీపీఎస్సీ మరోసారి నిర్వహించిందని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. ఇలా రెండోసారి మూల్యాంకనం చేసిన తర్వాత ఏపీపీఎస్సీ ఫలితాలు విడుదల చేసిందని చెప్తున్నారు. దీంతో రెండోసారి మూల్యాంకనం తర్వాత ఎంపికైన అభ్యర్ధులకే ఉద్యోగాలు ఇవ్వడం వివాదాస్పదమైంది.

అయితే రెండుసార్లు మూల్యాంకనం చేయలేదన్న ఏపీపీఎస్సీ వాదనతో హైకోర్టు సింగిల్ జడ్జి అంగీకరించలేదు. చివరికి రెండుసార్లు మూల్యాంకనం జరిగిందని నిర్ధారిస్తూ పరీక్షను రద్దు చేసింది. హైకోర్టు తీర్పుపై స్పందించిన ప్రభుత్వం దీనిపై అప్పీల్ కు వెళ్తామని ప్రకటించింది. అన్నట్లుగానే ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం అంటే రేపు విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించింది. దీంతో రేపటి నుంచి ఈ విచారణ జరగబోతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications