AP Inter Results 2024: ఎల్లుండే ఏపీ ఇంటర్ ఫలితాలు..!
ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా.. వాటి పునఃపరిశీలనతో పాటు మార్కుల నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో ఎల్లుండి అంటే ఏప్రిల్ 12న ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఎల్లుండి విద్యాశాఖ అధికారులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది మార్చి 1 నుంచి మార్చి 20 వరకూ ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి దాదాపు 10 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గత ఆదివారమే జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి ఫలితాలను విడుదల చేయబోతున్నారు.

ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల కానున్నాయి. ఈ నెల 12న రెండు ఫలితాలు వేర్వేరుగా విడుదల చేస్తారు. అదే సమయంలో ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను అప్ లోడ్ చేస్తారు. అనంతరం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి విద్యార్ధులు స్కోరు కార్డును యాక్సెస్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి అభ్యర్ధులు ఫలితాలు విడుదల కాగానే బోర్డు వెబ్ సైట్ లోకి వెళ్లి స్కోరు కార్డును డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications