Job Offer: లవ్ బ్రేకప్ అయిన వారికే ఉద్యోగం.. కంపెనీ వినూత్న ఆఫర్
Job Offer: సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలంటే విద్యార్హత, స్కిల్స్ వంటివి చూస్తారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం భిన్నమైన రూల్స్ పెట్టింది. విద్యార్హతతో సంబంధం లేకుండా లవ్ బ్రేకప్ అయిన వారికే ఉద్యోగం ఇస్తామంటూ వినూత్న కండిషన్ పెట్టింది. ఇంతకు ఆ ఉద్యోగం ఏంటీ.. లవ్ లో బ్రేకప్ కు ఉద్యోగానికి సంబంధం ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం.
బెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ చీఫ్ డేటింగ్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. లవ్, ఆన్ లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ ఉద్యోగానికి అర్హతలను వెల్లడించింది. ఉద్యోగానికి వచ్చేవారికి ఒక్కసారి లవ్ బ్రేకప్, రెండు సిట్యుయేషన్ షిప్ లు, మూడు డేట్స్ వంటివి ఉండాలని రూల్ పెట్టింది. ఇలాంటి వారు ఉద్యోగానికి అర్హులు అని కంపెనీ స్పష్టం చేసింది.

వీటితో పాటు ఉద్యోగానికి వచ్చేవారికి కొత్త డేటింగ్ నిబంధనలకు సంబంధించిన పరిజ్ఞానంతో పాటు కొత్తవాటిని సృష్టించడానికి కూడా తగినంత ధైర్యం కలిగి ఉండాలి. కనీసం 2-3 డేటింగ్ యాప్ లను వాడి ఉండాలి. డేటింగ్ టర్మ్స్ కూడా తెలిసి ఉండాలని కంపెనీ పేర్కొంది. ఇందులో అనుభవం ఉండాలి, కానీ క్యాట్ ఫిషింగ్ కు తావులేదని స్పష్టం చేసింది. అవసరమైన అన్ని లవ్ ఇంటెలిజెన్స్ ఉన్నవారు జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ నోటిఫికేషన్ లో వెల్లడించింది. అయితే ఆ కంపెనీ జీతం గురించి ఎలాంటి వివరాలను తెలపకపోవడం గమనార్హం.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications