HPCL Jobs: లక్షా 20 వేల జీతం.. హెచ్‌పీపీఎల్ కొలువుల జాతరకు రెడీనా..!
ప్రతిష్టాత్మకమైన నవరత్న కంపెనీ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ముంబైలోని తమ కార్యాలయాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశం. మొత్తం 63 ఖాళీలు ఉండగా, వివిధ విభాగాల్లో పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాల ద్వారా మీరు మంచి జీతం, భత్యాలు, మరియు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు.
ఖాళీల వివరాలు:
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మొత్తం 63 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటిల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్) 11 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) 17 పోస్టులు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) 6 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కెమికల్) 1 పోస్టు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ అండ్ సేఫ్టీ) 28 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు సంబంధిత విభాగంలో (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, ఫైర్ అండ్ సేఫ్టీ) ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి డిప్లొమాలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల అభ్యర్థులకు 50% మార్కులు ఉంటే సరిపోతుంది.
వయస్సు పరిమితి:
దరఖాస్తుదారుల వయస్సు 30.04.2025 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్థులకు: 3 సంవత్సరాలు, దివ్యాంగుల అభ్యర్థులకు: 10 సంవత్సరాలు, మాజీ సైనికోద్యోగులకు: 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 1180, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల అభ్యర్థులకు ఫీజు లేదు.
జీతం - ఇతర ప్రయోజనాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000 నుండి రూ. 1,20,000 వరకు జీతం ఉంటుంది. దీనితో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, వైద్య మరియు బీమా సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే, మీరు ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, మీ కుటుంబానికి భద్రత కూడా లభిస్తుంది.

ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT). ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది . రెండు భాగాలుగా విభజించబడుతుంది. పార్ట్-1: జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ . దీనిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ (లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్) ఉంటాయి. పార్ట్-2 టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్. దీనిలో సంబంధిత సబ్జెక్టు నుండి ప్రశ్నలు ఉంటాయి.గ్రూప్ టాస్క్/ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. సీబీటీలో అర్హత సాధించిన వారిని ఈ దశకు ఎంపిక చేస్తారు. మీ సమూహ నైపుణ్యాలు ,ఆలోచనా విధానాన్ని ఇక్కడ పరీక్షిస్తారు. స్కిల్ టెస్ట్. దీనిలో సంబంధిత ట్రేడ్‌లో మీ నైపుణ్యాన్ని పరీక్షించడానికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అనంతరం వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా మీ సామర్థ్యాలు, అనుభవం, ఆసక్తిని అంచనా వేస్తారు. వైద్య పరీక్షలు & ఫిజికల్ ఫిట్‌నెస్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ దశలో, మీరు ఉద్యోగానికి తగిన శారీరక , మానసిక ఆరోగ్యం కలిగి ఉన్నారా అని నిర్ధారిస్తారు.
ప్రతి దశలోనూ కనీస అర్హత మార్కులు సాధించిన వారిని మాత్రమే తదుపరి దశకు ఎంపిక చేస్తారు. తుది ఎంపిక కేటగిరీల వారీగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. సీబీటీ సిలబస్ , ఇతర వివరాలు త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
ప్రొబేషన్ పీరియడ్:
ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు ప్రొబేషన్‌లో పనిచేయవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ పనితీరును అంచనా వేసి, ఉద్యోగంలో కొనసాగించాలా వద్దా అని నిర్ణయిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: త్వరలో ప్రకటిస్తారు
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2025
దరఖాస్తు విధానం:
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు HPCL అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ [https://www.hindustanpetroleum.com/careers](https://www.hindustanpetroleum.com/careers) దరఖాస్తు చేసుకోవచ్చు. HPCL వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా కెరీర్ ప్రారంభించడం మీ భవిష్యత్తుకు ఒక గొప్ప మలుపు అవుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి,. వెంటనే దరఖాస్తు చేసుకోండి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications