ఒరాకిల్ సహా 22 కంపెనీలకు ఐఐటీల భారీ షాక్..! క్యాంపస్ ఇంటర్వూలపై బ్యాన్..!

దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలపై విద్యార్ధులకు ఎంతో మోజు ఉంటుంది. తమ చదువులు పూర్తయ్యాక క్యాంపస్ ఇంటర్వ్యూలు ఎక్కడ నిర్వహిస్తారో, ఎక్కడ ఉద్యోగాలు సులువుగా దొరుకుతాయో అలాంటి కాలేజీల్ని, ఉన్నత విద్యాసంస్థల్ని ఎంపిక చేసుకుని మరీ లక్షలు ఖర్చుపెట్టి జాయిన్ అవుతుంటారు. కానీ ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా మాయగా మారిపోతున్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విద్యార్ధులకు ఆఫర్లు ఇచ్చినట్లే ఇచ్చి ఉపసంహరించుకుంటున్నాయి. ఇలాంటి 22 టాప్ కంపెనీలకు దేశంలో ఐఐటీలు (IITs) మూకుమ్మడిగా షాకిచ్చాయి.

ఇక ఐఐటీల్లోనూ ఎంబీబీఎస్, ఎండీ కోర్సులు..! తొలిసారి అక్కడే..!
ఇక ఐఐటీల్లోనూ ఎంబీబీఎస్, ఎండీ కోర్సులు..! తొలిసారి అక్కడే..!

విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు ఇచ్చినప్పటికీ వారిని నియమించుకోవడంలో విఫలమైన 22 కంపెనీలకు, రాబోయే రెండు ప్లేస్‌మెంట్ సైకిల్స్ కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు తమ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ తలుపులను మూసేశాయి. ఈ ఏడాది గ్రాడ్యుయేట్లకు ఇచ్చిన హామీలను కంపెనీలు నిలబెట్టుకోవాలని ఆల్ ఐఐటీస్ ప్లేస్‌మెంట్ కమిటీ (ఏఐపీసీ) సెప్టెంబర్ 15 న ఆయా కంపెనీలకు అల్టిమేటం ఇచ్చింది. అయినా ఆఫర్లు నిలబెట్టుకోని కంపెనీల్ని వచ్చే రెండు ప్లేస్ మెంట్ సీజన్ లలో నిషేధించారు. ఈ కంపెనీలను రాబోయే రెండు ప్లేస్‌మెంట్ సీజన్‌లలో ఐఐటీలన్నీ తమ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి అనుమతించవు.

IITs Ban 22 Companies From Campus Placements After Offer Withdrawals
టెన్త్ లో 54 శాతం మార్కులు- సీన్ కట్ చేస్తే IIT బోంబేలో సీటు...!
టెన్త్ లో 54 శాతం మార్కులు- సీన్ కట్ చేస్తే IIT బోంబేలో సీటు...!

గతేడాదితో పోలిస్తే ఈ సమస్య తీవ్రత గణనీయంగా పెరిగింది. ప్లేస్‌మెంట్ కమిటీ అధికారుల ప్రకారం 23 ఐఐటీలలో ఇచ్చిన 150కి పైగా ఆఫర్లు ప్రస్తుత కేసుల్లో ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఒక్కొక్కటి 10 నుండి 15 ఆఫర్లు వెనక్కి తీసుకున్నాయి. దీంతో ఆయా కంపెనీలను సహాయ నిరాకరణగా భావించే నిషేధ కాలం ఎదుర్కొనేలా చేస్తున్నారు. ఇలాంటి కంపెనీల్లో ఒరాకిల్ కూడా ఒకటని ఐఐటీ వర్గాలు తెలిపాయి. ఐఐటి విద్యార్థులకు ఇచ్చిన సుమారు 40 ఆఫర్లను ఆ కంపెనీ అమలు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ జాబితాలో పలు స్టార్టప్‌లు కూడా ఉన్నాయి. గతేడాది ఉద్యోగ ఆఫర్లను నెరవేర్చని కారణంగా సుమారు 10 నుండి 11 కంపెనీలు వేర్వేరు ఐఐటీల నుండి ఇలాంటి చర్యలనే ఎదుర్కొన్నాయి. ఈ సంవత్సరం ఆ సంఖ్య 22కు పెరిగింది. దీంతో ప్లేస్‌మెంట్ కమిటీ ఐఐటీలన్నింటిలోనూ సమన్వయ విధానాన్ని అవలంబించేలా చేసింది. ఆఫర్లను ఉపసంహరించుకోవడం వల్ల ప్రభావితమైన విద్యార్థుల కోసం, ప్లేస్‌మెంట్ కార్యాలయాలు ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+