ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సువర్ణావకాశం.. రూ.85,920 జీతంతో !
నిరుద్యోగ అభ్యర్థులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తీపికబురు ప్రకటించింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం అందిస్తుండడం మంచి అవకాశం అని చెప్పొచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలను అర్హులు. అభ్యర్థులు మే 12వ తేదీ నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మంచి ఛాన్స్ ని ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవచ్చు. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
IOB NOTIFICTION FOR LOCAL BANK OFFICER..
పోస్టు..
లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (ఎల్‌బీఓ)
మొత్తం ఖాళీలు..
400
విద్యార్హత..
ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు..
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
OBC - 3 సంవత్సరాలు
SC/ST - 5 సంవత్సరాలు
దివ్యాంగ అభ్యర్థులు - 10 సంవత్సరాలు
వేతనం..
సెలెక్ట్ అయిన అభ్యర్థుల నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ..
ఆన్ లైన్
దరఖాస్తు గడువు..
2025 మే 12 నుంచి 2025 మే 31 వరకు
దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు - రూ.850
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు - రూ.175
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ https://iob.in/Careers ను సందర్శించవచ్చు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. గడువు ముగిసే లోపు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.












Click it and Unblock the Notifications