JEE Mains 2024: త్వరలో జేఈఈ మెయిన్ సెషన్ 1 ప్రొవిజనల్ ఆన్సర్ కీ -డౌన్ లోడ్ ఇలా..!

ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసేందుకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సిద్దమవుతోంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ పూర్తి కావడంతో ఆన్సర్ కీ విడుదల కోసం ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. విడుదల కాగానే అభ్యర్ధులు jeemain.nta.ac.in వెబ్ సైట్ నుంచి ఈ ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్ పీడీఎఫ్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షను జనవరి 24, 27, 29, 30,31, ఫిబ్రవరి 1 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో ఎన్టీఏ నిర్వహించింది. ఈ పరీక్షా ఫలితాల్ని ఫిబ్రవరి 12న విడుదల చేయబోతోంది. అంతకు ముందే ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఎన్టీఏ వెబ్ సైట్లో విడుదల చేస్తుంది. దీని తర్వాత ఎన్టీఏ అబ్జెక్షన్ విండో ఓపెన్ చేస్తుంది. ఇందులో ప్రశ్నల వారీగా ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

JEE Main Provisional Answer Key 2024 release soon- here is how to download

ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తుది ఆన్సర్ కీని, ఫలితాలను విడుదల చేస్తుంది. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 2 వరకూ ఇది కొనసాగనుంది. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్ష రాయాలనుకునే వారు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్టీఏ అవకాశం కల్పిస్తోంది. ఏప్రిల్ లో సెషన్ 2 పరీక్ష నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+