NALCO Recruitment 2021:భారీగా పోస్టులు.. శాలరీ కూడా హై.. ఆప్లై చేయండి

కరోనా వల్ల మార్కెట్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. పరిమిత వనరులతో కంపెనీలు నెట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సంస్థలు జాబ్ ఆఫర్ చేస్తున్నాయి. నేషనల్ ఆల్యుమినియం కంపెనీ లిమిటెడ్ కూడా వివిధ కొలువులకు సంబంధించి జాబ్ ఆఫర్ చేసింది. మేనేజర్, డిప్యూటి మేనేజర్ కొలువులకు నోటిఫికేషన్ ఇచ్చింది. సంస్థలో 86 ఉద్యోగాలు ఉన్నాయని అందులో వివరించింది.

హెచ్ అండ్ ఏ, పీఆర్అండ్ సీసీ, సిస్టమ్, సివిల్, లా, ఫైనాన్స్, మైనింగ్, కెమిస్ట్రీ, ల్యాబ్, జియోలాజీ, మార్కెటింగ్, మెటిరియల్ అండ్ హర్జికల్చర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. ఈ నెల 8వ తేదీ తర్వాత ఆన్ లైన్ ఆప్లై చేసుకోవాలని కోరింది. దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 7వ తేదీని నిర్ణయించింది.

 NALCO Recruitment 2021: Notification Out For 86 Manager & Other Posts

జనరల్ మేనేజర్ కొలువులు 12, గ్రూపు జనరల్ మేనేజర్ 3, మేనేజర్ 5, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 7, డిప్యూటీ జనరల్ మేనేజర్ 1, సీనియర్ మేనేజర్ 7 పోస్టులు ఉన్నాయి. గ్రూపు జనరల్ మేనేజర్ లక్ష 20 వేల నుంచి 2 లక్షల 80 వేల వేతనం ఇస్తారు. జనరల్ మేనేజర్ స్కేల్, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్కేల్ అదేవిధంగా ఉంటుంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లక్ష నుంచి 2 లక్షల 60 వేలు ఉంటుంది. సీనియర్ మేనేజర్ 90 వేల నుంచి 2 లక్షల 40 వేలు ఉంటుంది. మేనేజర్ స్కేల్ 80 వేల నుంచి 2 లక్షల 20 వేలు ఉంటుంది. డిప్యూటీ మేనేజర్ స్కేల్ 70 వేల నుంచి 2 లక్షలు, అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 60 వేల నుంచి లక్ష 80 వేలు ఉంటుంది.

బేసిక్ పే ఉంటుంది. డీఏ, ఇండస్ట్రీయల్ పాట్రాన్ మాదిరిగా ఉంటుంది. ఫార్మార్మెన్స్‌ను బట్టి శాలరీ ఉంటుంది. కంపెనీ అకమెడెషన్, హెచ్ఆర్ఏ, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఫ్యామిలీకి కూడా వైద్యం అందనుంది. రిటైర్ అయ్యాక కూడా మెడికల్ బెనిఫిట్ ఉంటుంది. లీవ్ ఎన్ క్యాష్ మెంట్, పెన్షన్, ఎన్పీఎస్, కాంట్రిబ్యూటరీ ప్రావిడెండ్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+