NEET PG 2026 ఎగ్జామ్ డేట్ అనౌన్స్.. ఫుల్ షెడ్యూల్ లిస్ట్ ఇదే !
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ (NEET PG), నీట్ ఎమ్‌డిఎస్ (NEET MDS)-2026 పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రకటనతో లక్షలాది మెడికల్ విద్యార్థులకు స్పష్టత వచ్చింది.
NEET PG పరీక్షల తేదీల వివరాలు..
NBEMS వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం నీట్ ఎమ్‌డిఎస్-2026 పరీక్షను 2026 మే 2వ తేదీన నిర్వహించనున్నారు. అదే విధంగా నీట్ పీజీ-2026 పరీక్షను దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో 2026 ఆగస్టు 30వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇంటర్న్‌షిప్ గడువు తేదీలు స్పష్టం..
NEET PG పరీక్షలకు అర్హత పొందాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుందని NBEMS స్పష్టం చేసింది.
- నీట్ ఎమ్‌డిఎస్ అభ్యర్థులు: 2026 మే 31వ తేదీలోపు తమ ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి.
- నీట్ పీజీ అభ్యర్థులు: 2026 సెప్టెంబర్ 30వ తేదీలోపు ఇంటర్న్‌షిప్ పూర్తిచేయాలని సూచించింది.
గడువు దాటినట్లయితే అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అనర్హులవుతారని స్పష్టమైన హెచ్చరిక కూడా ఇచ్చింది.
అభ్యర్థులకు ముందస్తు ప్రణాళికకు అవకాశం..
తాత్కాలిక షెడ్యూల్ విడుదల కావడంతో, అభ్యర్థులు తమ చదువు, ఇంటర్న్‌షిప్ షెడ్యూల్, పరీక్షా సిద్ధతను ముందుగానే ప్రణాళిక చేసుకునే అవకాశం లభించింది. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
అప్లికేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు?
ఈ షెడ్యూల్ తాత్కాలికమని NBEMS స్పష్టం చేసింది. పూర్తి నోటిఫికేషన్, అప్లికేషన్ ప్రారంభ తేదీలు, ఫీజు వివరాలు, పరీక్షా నగరాల ఎంపిక వంటి అంశాలను సంబంధిత పరీక్షలకు కొన్ని నెలల ముందే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనుంది.
నీట్ పీజీ ( NEET PG ), నీట్ ఎమ్‌డిఎస్ పరీక్షలు దేశవ్యాప్తంగా ఎమ్‌డీ, ఎమ్‌ఎస్, పీజీ డిప్లొమా, ఎమ్‌డిఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఏకైక మార్గంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకటన మెడికల్ పీజీ ప్రవేశాల ప్రక్రియలో కీలక దశగా భావిస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించిన అన్ని తాజా అప్‌డేట్లు, మార్పులు, మార్గదర్శకాలను NBEMS అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. అనధికారిక సమాచారం లేదా వదంతులను నమ్మవద్దని కూడా బోర్డు హెచ్చరించింది.












Click it and Unblock the Notifications