Jobs: CISFలో 451 ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో 451 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికి శుభవార్త చెప్పింది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ పరిశ్రమల భద్రత నిమిత్తం కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్స్(డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్- ఫైర్ సర్వీస్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.

రూ.69,100 వేతనం
ఈ ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 22లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక వారికి నెలకు రూ.21,700 - రూ.69,100 వేతనం ఇస్తారు. మొత్తం 451 ఉద్యోగాలాల్లో కానిస్టేబుల్/ డ్రైవర్ 183 పోస్టులు ఉన్నాయి. యూఆర్- 76, ఎస్సీ- 27, ఎస్టీ- 13, ఓబీసీ- 49, ఈడబ్ల్యూఎస్- 18 ఉన్నాయి. కానిస్టేబుల్/ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ 268 పోస్టులు ఉన్నాయి. యూఆర్- 111, ఎస్సీ- 40, ఎస్టీ- 19, ఓబీసీ- 72, ఈడబ్ల్యూఎస్- 26 ఉన్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్(హెవీ మోటార్ వెహికల్ )తో పాటు మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ఎత్తు 167 సెం.మీ., ఛాతీ కొలత 80-85 సెం.మీ. ఉండాలి. దరఖాస్తు రుసుము: రూ.100 కాగాఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. మొదటగా ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
అటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 225 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో ఎకనామిస్ట్-02, సెక్యూరిటీ ఆఫీసర్-03, సివిల్ ఇంజినీర్-10, లా ఆఫీసర్-03, ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్-04, డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్-50, బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్-02, ఎలక్ట్రికల్ ఇంజినీర్-15, రాజభాష ఆఫీసర్-10, హెచ్‌ఆర్/ పర్సనల్ ఆఫీసర్-05, డేటా అనలిటిక్స్-03, ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్ (2/ 3)-11, డిజిటల్ బ్యాంకింగ్, మేనేజర్-05,
ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్-10, మొబైల్ యాప్ డెవలపర్-10, డాట్ నెట్ డెవలపర్-10, మిగతా ఉద్యోగులు 71 ఉన్నాయి.

విద్యా అర్హత
సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయస్సు కనిష్ఠంగా 25, గరిష్ఠంగా 35, 38 సంవత్సరాలు మించకూడదు. పోస్టులను బట్టి మారుతుంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 6 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా ఉంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications