వైద్యారోగ్య శాఖలో 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వైద్యారోగ్య శఆఖలో 1147 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. వైద్యశాఖ సంచాలకుల పరిధిలో మొత్తం 34 విభాగాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చేయనున్నారు.
మొత్తం 1147 పోస్టుల్లో అధికంగా అనస్థీషియాలో 155, జనరల్ సర్జరీలో 117, జనరల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబర్ 20న ఉదయం 10:30 గంటల నుంచి జనవరి 5వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారే దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూరాలజీ - 11
న్యూరో సర్జరీ - 16
ప్లాస్టిక్ సర్జరీ - 17
పీడియాట్రిక్ సర్జరీ -08
యూరాలజీ - 17
నెఫ్రాలజీ - 10
మెడికల్ అంకాలజీ -01
అనాటమీ - 26
ఫిజియాలజీ - 26
పాథాలజీ - 31
కమ్యూనిటీ మెడిసిన్(ఎస్‌పీఎం) - 23
మైక్రో బయాలజీ - 25
ఫొరెన్సిక్ మెడిసిన్,
టాక్సికాలజీ - 25
బయోకెమిస్ట్రీ - 20
ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ - 14
జనరల్ మెడిసిన్ - 111
జనరల్ సర్జరీ - 117
పీడియాట్రిక్స్ - 77
అనస్థీషియా - 155
రేడియో డయాగ్నోసిస్ - 46
రేడియేషన్ అంకాలజీ -05
సైకియాట్రి - 23
రెస్పిరేటరి మెడిసిన్ - 10
డెర్మటాలజీ - 13
ఒబెస్టిట్రిక్స్, గైనకాలజీ - 142
అప్తామాలజీ - 08
ఆర్థోపెడిక్స్ - 62
ఈఎన్టీ - 15
హాస్పిటల్ అడ్మిన్ - 14
ఎమర్జెన్సీ మెడిసిన్ - 15
కార్డియాలజీ - 17
కార్డియాక్ సర్జరీ - 21
ఎండోక్రైనాలజీ - 12
గ్యాస్ట్రో ఎంట్రాలజీ - 14 పోస్టులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications