PNBలో భారీగా జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) నుంచి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మార్చి 24వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

మొత్తం పోస్టుల సంఖ్య: 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు క్రెడిట్ ఆఫీసర్‌ 250, ఇండస్ట్రీ ఆఫీసర్‌ 75,మేనేజర్‌(ఐటీ) 05,సీనియర్ మేనేజర్‌ (ఐటీ) 05,మేనేజర్‌ డేటా సైంటిస్ట్‌03, సీనియర్ మేనేజర్‌ (డేటా సైంటిస్ట్‌) 02,మేనేజర్‌ సైబర్ సెక్యూరిటీ 05, సీనియర్‌ మేనేజర్‌ సైబర్‌ సెక్యూరిటీ 05

PNB Announces Recruitment for 350 Specialist Officer Posts Apply by March 24

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, బీఈ, సీఎ, ఐసీడబ్ల్యూ, ఎంబీఏ, పీజీడిఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

చివరి తేదీ : మార్చి 24వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 21 నుంచి 38 ఏళ్లు మధ్యలో ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

సెలక్షన్ విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష తేదీలు: మే 2025లో నిర్వహించే అవకాశం ఉంది.

జీతం: పోస్టులకు బట్టి వేతనం ఉంటుంది. క్రెడిట్ ఆఫీసర్‌, ఇండస్ట్రీ ఆఫీసర్‌ పోస్టులకు నెలకు రూ.48,480- రూ.85,920, మేనేజర్‌ (ఐటీ), మేనేజర్‌ డేటా సైంటిస్ట్‌, మేనేజర్‌ సైబర్ సెక్యూరిటీ పోస్టులకు రూ.64,820 - 93,960, సీనియర్ మేనేజర్‌ (ఐటీ), సీనియర్ మేనేజర్‌ (డేటా సైంటిస్ట్‌), సీనియర్‌ మేనేజర్‌ సైబర్‌ సెక్యూరిటీ పోస్టులకు రూ.85,920 - 1,05,280.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+