RBI: టెన్త్ పాసైతే చాలు ఆర్బీఐలో ఉద్యోగం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 572 పోస్టులను భర్తీ చేయనుండగా, ఇందులో హైదరాబాద్ కేంద్రంలో 36 ఉద్యోగాలు ఉన్నాయి. టెన్త్ పాస్ అయిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా ఆర్‌బీఐ పేర్కొంది. దరఖాస్తులను ఫిబ్రవరి 4 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువులు పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు కాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం రావడం తప్పనిసరి. ఈ భాషా పరిజ్ఞానాన్ని ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రత్యేకంగా పరీక్షించనున్నారు. అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదట ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత స్థానిక భాషపై అవగాహన ఉందో లేదో తెలుసుకునేందుకు లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ) నిర్వహిస్తారు.
ఆర్‌బీఐలో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగం ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగంగా భావించబడుతోంది. తక్కువ విద్యార్హతతో బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించాలనుకునే యువతకు ఇది మంచి అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దరఖాస్తు విధానం, పరీక్ష వివరాలు, ఇతర అర్హతలపై పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in ను సందర్శించాలని సూచించారు.
-
ఇంటర్ అర్హతతో "అగ్నివీర్ వాయు" ఉద్యోగాలు.. గడువు పెంపు..! -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..!












Click it and Unblock the Notifications