SSC Constable recruitment: 7547 పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి, మంచి జీతం

న్యూఢిల్లీ: ఇంటర్ పాసై పోలీస్ ఉద్యోగంలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 7,547 కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్‌సీ ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

డిసెంబర్ నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
SSC కానిస్టేబుల్ పరీక్ష 2023కి హాజరు కావాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను ssc.nic.inలో సమర్పించవచ్చు. అప్లికేషన్ దిద్దుబాటు విండో అక్టోబర్ 3 నుంచి అక్టోబరు 4 వరకు సక్రియంగా ఉంటుంది.

SSC Constable notification: Register for 7547 posts till September 30

మొత్తం పోస్టులు: 7547 కానిస్టేబుల్ పోస్టుల్లో పురుషులు: 5056, మహిళలు 2491 చొప్పున ఉన్నాయి.

అర్హత: 10+2(సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్(LMV) ఉండాలి.
వేతనం: పే లెవల్-3: రూ. 21,700-kp. 69,100

దరఖాస్తు రుసుం: రూ. 100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మినహాయింపు)

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు(పీఈటీ/పీఎంటీ), వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. జీకే/కరెంట్ అఫైర్స్ 50 ప్రశ్నలకు 50 మార్కులు, రీజనింగ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 15 ప్రశ్నలకు 15 మార్కులు, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, వెబ్ బ్రౌజర్స్ 10 ప్రశ్నలకు 10 మార్కుల చొప్పున ఉంటాయి. మొత్తం 90 నిమిషాలపాటు పరీక్ష జరగనుంది.

పరీక్ష ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉంటుంది. ఒక్కో తప్పు సమాధానికి పావు మార్కు చొప్పున కోత కూడా ఉంటుంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, గుంటూరు, చీరాల, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం.

SSC Constable నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+