తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల: ఇలా డౌన్‌లోడ్ చేస్కోండి

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ(DSC) పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు గురువారం విడుదలయ్యాయి. హాల్​ టికెట్లను అధికారిక వెబ్‌​సైట్‌​లో అందుబాటులో ఉంచింది విద్యాశాఖ. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

డీఎస్సీ హాల్‌టికెట్లను www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న మొత్తం 11,062 పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. జులై 18 నుంచి సీబీటీ బేసిడ్​ టెస్ట్​ నిర్వహించనుంది. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.

Telangana DSC Hall Tickets Released

డీఎస్సీ పరీక్షల షెడ్యూల్:

జులై 18 న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌ పరీక్ష
జులై 18 సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
జులై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
జులై 23 న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్‌ పరీక్ష
జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష

ఇది ఇలావుండగా, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ, డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ ముట్టడి, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించారు. అభ్యర్థుల ఆందోళనలకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. అయితే, ప్రభుత్వం మాత్రం డీఎస్సీని షెడ్యూల్​ ప్రకారమే నిర్వహించాలని నిర్ణయించింది. డీఎస్సీని అడ్డుకోవాలని కొందరు కుట్రలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గురువారం నుంచి వెబ్‌​సైట్‌లో హాల్​టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+