తెలంగాణ గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ ఇదే: 9 నుంచి హాల్ టికెట్లు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్ 2 పరీక్ష షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. ఇక, గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లను డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.
టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in/) నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ సూచించింది. హాల్‌టికెట్ టికెట్ డౌన్‌లోడ్ సమయంలో ఏదైనా సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారులను సంప్రదించాలని పేర్కొంది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

కాగా, 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం 5.7 లక్ష్లల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ ఏడాది ఆగస్టు నెలలోనే గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉండగా.. అదే సమయంలో డీఎస్సీ పరీక్షలుఉండటంతో ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం లేదని గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో అభ్యర్థుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలను యథావిధిగా నిర్వహించి.. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసింది. డీఎస్సీ తోపాటు గ్రూప్ 3 పరీక్షలు కూడా పూర్తి కావడంతో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 9 నుంచి హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనుంది.












Click it and Unblock the Notifications