తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు2024 విడుదల..
తెలంగాణ పీజీఈసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి.. నేటి (మంగళవారం) సాయంత్రం నాలుగుగంటల సమయంలో హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్ ఆచార్య లింబాద్రి టీజీ పీజీఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల 10 వ తేది నుంచి 13వ తేదివరకు తెలంగాణ పీజీఈసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వీటి ఫలితాలు విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20,626 మంది విద్యార్థులు పీజీఈసెట్ పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు వచ్చిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులకు కనీస అర్హత మార్కులనేవి అస్సలు ఉండవు. వచ్చిన మార్కులు ఆధారంగా వారికి ర్యాంకులు కేటాయిచడం జరగుతుంది.
రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. అయితే, ఈ ఏడాది ఈ పరీక్ష హైదరాబాద్ జేఎన్‌టియూ ఆధ్వర్యంలో జరిగింది. ఈ పరీక్షలకు రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు తెలంగాణ పీజీఈసెట్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

స్కోర్ కార్డ్ ఇలా చూసుకోండి..?
ముందుగా అభ్యర్థులు పీజీఈసెట్ అధికారిక వెబ్ సైట్ లోకి https://pgecet.tsche.ac.in/ వవెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత హోంపేజీలో కనిపించే ర్యాంక్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అభ్యర్థి లాగిన్ వివరాలు-పీజీఈసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. వెంటనే స్క్రీన్ పై పీజీఈసెట్ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది. ఆ తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడం ఉత్తమం.












Click it and Unblock the Notifications