UPSC: ఎన్డీయే, సీడీఎస్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల-పూర్తి వివరాలివే..!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రతీ ఏటా నిర్వహించే ఎన్డీయే నావల్ అకాడమీ పరీక్ష, సీడీఎస్ పరీక్షల కోసం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు యూపీఎస్సీ వెబ్ సైట్ upsc.govలోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులో పరీక్షలకు దరఖాస్తు తేదీలు, ఇతర వివరాలను అందుబాటులో ఉంచుతున్నారు. అర్హత కలిగిన అభ్యర్ధులు 2024లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ పరీక్ష, అలాగే 2024లో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేసుకోమని యూపీఎస్సీ కోరుతోంది.
యూపీఎస్సీ ఎన్డీయే, సీడీఎస్, ఎన్ఎ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ వచ్చే ఏడాది జనవరి 9గా నిర్ణయించారు. అలాగే ఈ పరీక్షలన్నీ ఏప్రిల్ 21, 2024న దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నిర్వహిస్తారు. యూపీఎస్సీ ఎన్డీయే 1 2024 నోటిఫికేషన్ ను కమిషన్ పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచింది. ఇందులో అభ్యర్ధుల విద్యార్హత, రిజిస్ట్రేషన్ విధానం, దరఖాస్తు రుసుము, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలతో తమను తాము పరిచయం చేసుకోవడానికి అవసరమైన పత్రం అందుబాటులో ఉంచారు. ఎన్డీయే పరీక్షకు సిద్ధం కావడానికి ముందు ఇవన్నీ తప్పనిసరి అని నిపుణులు చెప్తున్నారు.

ఎన్డీయే, సీడీఎస్ 1 పరీక్షలకు దరఖాస్తు ఇలా..
upsc.gov.inలో అధికారిక UPSC వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్‌పేజీలో UPSC NDA లేదా UPSC CDS I పరీక్ష 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
అభ్యర్థి నమోదు కోసం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, అభ్యర్థులు తమ ఖాతాలకు లాగిన్ అవుతారు.
దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, దరఖాస్తు రుసుము చెల్లించాలి.
సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసి, అక్ నాలెడ్జ్ మెంట్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
భవిష్యత్ అవసరాల కోసం అక్ నాలెడ్జ్ మెంట్ పేజీ హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోవాలి.
UPSC NDA మరియు UPSC CDS కోసం దరఖాస్తు రుసుము రూ.100/-. అభ్యర్థులు ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో నగదు రూపంలో డిపాజిట్ చేయడం ద్వారా లేదా వీసా/మాస్టర్/రూపే క్రెడిట్/డెబిట్ కార్డ్/UPI చెల్లింపు లేదా ఏదైనా బ్యాంక్ నుండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. అదనపు సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications