NEET UG: డబ్బుంటే డాక్టర్లు చేసేలా నీట్ ? 2 శాతం ధనికులకు 48 శాతం సీట్లు-ఇవి తెలిస్తే షాక్..!

మన దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఏటా కేంద్రం నిర్వహిస్తున్న నీట్ పరీక్ష తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యంగా ఈసారి పేపర్ లీక్ లతో నీట్ ప్రతిష్ఠ మసకబారింది. ర్యాంకులపై అనుమానాలు అభ్యర్ధులు, తల్లితండ్రుల్లో ఆందోళన నింపాయి. చివరికి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకున్నా పరిస్ధితి మారేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అసలు నీట్ పరీక్ష ధనికులకు రిజర్వేషన్ గా మారిపోయిందన్న వాదన వెనుక ఉన్న షాకింగ్ రీజన్స్ ఓసారి చూద్దాం..

నీట్ వర్సెస్ జేఈఈ:

కెరీర్స్ 360 సంస్థ వ్యవస్థాపకుడు మహేశ్వర్ పేరీ నీట్ పరీక్ష ధనికులకు రిజర్వేషన్ గా మారిపోయిందంటూ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు ఆయన పలు ఆధారాల్ని చూపారు. దేశంలో ఈసారి నీట్ రాసిన వారు 23 లక్షల 33 వేల 297 మంది కాగా, జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసిన వారు 14 లక్షల 15 వేల 110 మంది. ఇందులో నీట్ రాసిన రాసిన వారిలో బాలురు 43 శాతం, బాలికలు 57 శాతం ఉన్నారు. జేఈఈ మెయిన్స్ రాసిన వారిలో బాలురు 67 శాతం ఉంటే 0బాలికలు 33 శాతం ఉన్నారు.

why NEET exam become reservation for rich what experts says

704 కాలేజీల్లో లక్షా 9 వేల సీట్లు:

అాలాగే దేశంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 704 కాగా... ఇందులో మొత్తం లక్షా 9 వేల 170 సీట్లు ఉన్నాయి. వీటిలో డీమ్డ్ యూనివర్శిటీల పరిధిలో 51 కాలేజీలు ఉంటే 10250 సీట్లున్నాయి. ప్రైవేట్ కాలేజీలు 264 ఉంటే 42515 సీట్లు ఉన్నాయి. సెంట్రల్ యూనివర్శిటీలు 7 ఉంటే 1180 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలు 382 ఉంటే 55225 సీట్లు ఉన్నాయి. అలాగే ఒక్కో విభాగంలో ఫీజులు ఒక్కోలా ఉన్నాయి.

6.5 లక్షల నుంచి కోటిన్నర ఫీజులు:

ఫీజుల విషయానికొస్తే ప్రభుత్వ కాలేజీల్లో ఐదేళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు రూ.3.5 -6.5 లక్షలు ఖర్చవుతుంటే, ప్రైవేట్ కాలేజీల్లో మాత్రం అవే ఐదేళ్లకు రూ.80 లక్షల నుంచి కోటిన్నర వరకూ అవుతోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సగటున ఏడాదికి రూ.12 లక్షల 76 వేల 446 ఫీజు ఉంటోంది. వీటికి హాస్టల్, మెస్ ఛార్జీలు అదనం. ఈ లెక్కన ఐదేళ్లకు రూ.80 లక్షల వరకూ ఖర్చవుతోంది. ఇక డీమ్డ్ యూనివర్శిటీల విషయానికొస్తే ఐదేళ్లకు కోటిన్నర వరకూ ఖర్చవుతోంది. దేశంలోని డీమ్డ్ యూనివర్శిటీల్లో ఎంబీబీఎస్ కోర్సుకు ఏటా రూ.20 లక్షలకు పైగానే ఖర్చవుతోంది. ఈ లెక్కన ఐదేళ్లకు 1.22 కోట్లు ఖర్చు తప్పట్లేదు.

నీట్ అడ్మిషన్లు :

ఇక నీట్ లో అర్హత సాధించే విద్యార్ధులను చూస్తే ఈ ఏడాది 13.16 లక్షలు ఉండగా.. సీట్ల సంఖ్య 1.09 లక్షలు ఉంది. దేశవ్యాప్తంగా ఏ ఇతర పోటీ పరీక్షల్లో అయినా అర్హత సాధించాలంటే కనీసం 30-35 శాతం మార్కులు సాధించాల్సి ఉండగా.. నీట్ కు మాత్రం ఈ ఏడాది 22 శాతం మార్కులొస్తే ఉత్తీర్ణుల్ని చేశారు. ఇది గతేడాది 19 శాతం, 2022లో 16.36 శాతం, 2021లో 19.17 శాతంగా ఉంది. దీంతో లక్షల మంది నీట్ ద్వారా కేవలం 20 శాతం మార్కులు సాధించి ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సులువుగా అర్హత సాధించేస్తున్నారు. వీరంతా ప్రైవేటు, డీమ్డ్ యూనివర్శిటీల్లో భారీగా డబ్బు ఖర్చుపెట్టి అడ్మిషన్లు తీసుకుంటున్నవారే.

ధనికులకు సీట్ల రిజర్వేషన్ :

నీట్ లో తక్కువ కటాఫ్ మార్కుల కారణంగా లక్షల సంఖ్యలో ధనిక విద్యార్ధులు అర్హత సాధించి ప్రైవేట్, డీమ్డ్ యూనివర్శిటీల్లో సీట్లు కొనుక్కుంటుంటే అర్హత ఉండీ డబ్బులు లేని వారంతా ఇప్పుడు మన దేశంలో సీట్లు రాక విదేశాలకు వెళ్లి ఎంబీబీఎస్ చదువుకోవాల్సిన పరిస్ధితి నెలకొంటోంది. ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్ వర్శిటీల్లో 80 లక్షల నుంచి కోటిన్నర ఫీజు తీసుకుని లక్షల ర్యాంకులు వచ్చిన ధనికులకు సీట్లు ఇస్తుంటే.. 3.5 లక్షల నుంచి 6.5 లక్షల ఫీజులున్న ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లకు పోటీ పడలేక వీరంతా విదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్ధితి.

విదేశాలకు పరుగు :

ఇలా విదేశాల్లో ఎంబీబీఎస్ చేసి తిరిగి భారత్ కు వచ్చి డాక్టర్లుగా పనిచేయాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (FMGE) రాసి అర్హత సాధిస్తేనే మెడికల్ కౌన్సిల్ గుర్తింపు ఇస్తుంది. ఇలా విదేశాలకు వెళ్లి చదువుకుని తిరిగి వచ్చి ఈ పరీక్ష రాసే వారిలోనూ కేవలం ప్రతీ ఐదుగురిలో ఒక్కరు మాత్రమే గుర్తింపు సాధిస్తున్నారు. అంటే కేవలం 20 శాతం విద్యార్ధులే ఇలా అర్హత సాధిస్తున్నారు. మిగతా వారంతా గుర్తింపు లేక అనర్హులుగా మిగిలిపోతున్నారు.

ధనికుల రిజర్వేషన్ గా నీట్ :

ఇవన్నీ గమనిస్తే మొత్తం మెడికల్ కాలేజీల్లో 2 శాతం జనాభా కోసం 48 శాతం సీట్లు రిజర్వ్ చేసి ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 1.09 లక్షల సీట్లలో 52765 సీట్లు కేవలం ప్రైవేట్ కాలేజీల్లో, ధనిక కాలేజీల్లో మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్ధితుల్లో మన విద్యార్ధులు నీట్ ద్వారా సీట్లు తెచ్చుకోలేక విదేశాలకు పయనమవుతున్నారు. ఇలా వెళ్లిపోతున్న వైద్య విద్యార్ధుల సంఖ్య ఐదేళ్లలో 117 శాతం పెరిగింది. 4 కోట్లు పెడితే ఎన్నారైలు ఇండియాలో ఎంబీబీఎస్ చేసే పరిస్ధితి ఉండగా.. మన విద్యార్ధులు ఇక్కడ సీట్లు దొరక్క విదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్ధితి. దీన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వాలు సిద్దంగా లేకపోవడమే విషాదంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+