హీరోయిన్ గదిలో దొరికిన నితిన్.. వీడియో లీక్
టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ కూడా ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుస సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటున్నాడు నితిన్. అయితే నితిన్‌కు రావాల్సిన పేరు ఇంకా రాలేదని అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఒక హిట్ పడితే నాలుగు ఫ్లాపులు అన్నట్టుగా సాగుతోంది నితిన్ కెరీర్. జయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నితిన్ తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే దిల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆ తరువాత నుంచి నితిన్ కెరీర్ గాడి తప్పింది.
నాలుగు సినిమాలకు ఓ హిట్టు అన్న చందంగా మారింది. 'భీష్మ' తరువాత నితిన్ నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. నితిన్ చివరి సినిమా 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. నాసిరకం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. నితిన్ ప్రస్తుతం 'రాబిన్ హుడ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. తనకు 'భీష్మ' వంటి హిట్ ఇచ్చిన వెంకీ కడుములనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే నితిన్,శ్రీలీలకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. నితిన్ ఓ గదిలో ఉండగా, ఆ గదికి ముందు హీరో అని రాసి ఉంటుంది. అయితే శ్రీలీల ఆ బోర్డును హీరోయిన్ అని ఛేంజ్ చేసి లోపలికి వెళ్లి, మీరు నా గదిలో ఉన్నారంటీ అని నితిన్‌ను శ్రీలీల ప్రశ్నిస్తోంది. ఇది నా గది అంటూ శ్రీలీలకు నితిన్ చెబుతూ బయటకు వచ్చి చూడగానే హీరోయిన్ అని రాసి ఉండటంతో హీరో అని ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయి, వెంటనే హీరోయిన్ అనే పదాన్ని తొలగించి, హీరో అని ఉందని నితిన్‌కు చూపించి,ఇప్పుడు ఓకేనా అంటూ శ్రీలీలకు కౌంటరిస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications