అభిషేక్ బచ్చన్ సంచలన పోస్ట్..ఐశ్వర్యరాయ్ విడాకులు ఖాయం..?
బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూర్చేలా బచ్చన్ ఫ్యామిలీ వ్యవహరించడంతో అందరూ ఇది నిజమే అని నిర్థారణకు వచ్చేశారు. ఇదే సమయంలో బిగ్ బి అమితాబ్ తన కొడలు ఐశ్వర్యరాయ్‌ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు.
ఇది చూసిన నెటిజన్లు ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని.. అందుకే అమితాబ్ ఐశ్వర్యరాయ్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని చర్చించుకున్నారు. తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది.

ఫొటో సెషన్‌లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫొటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఇదిలా ఉంటే తాజాగా అభిషేక్ బచ్చన్ చేసిన ఓ పనితో వీరి విడాకులు ప్రస్తావన మరోసారి తెర మీదకు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకులకు సంబంధించిన పోస్ట్‌కు లైక్ కొట్టారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
అసలు ఆ పోస్ట్‌లో ఏముందంటే..విడాకులు ఎవరికీ అంత సులభం కాదు. వృద్ధ జంటలు వీధి దాటుతున్నప్పుడు చేతులు పట్టుకుని ఉన్న ఆ హృదయాన్ని కదిలించే వీడియోలను మళ్లీ రూపొందించాలని కలలు కనేవారు లేదా ఊహించలేరు? అయినప్పటికీ, కొన్నిసార్లు జీవితం మనం ఆశించినట్లుగా సాగదు. కానీ ప్రజలు దశాబ్దాల తర్వాత విడిపోయినప్పుడు, వారి జీవితంలో గణనీయమైన భాగాన్ని పెద్ద మరియు చిన్న విషయాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడి గడిపిన తర్వాత వారు ఎలా భరించగలరు? బంధాలను తెంచుకోవడానికి వారిని ఏది పురికొల్పుతుంది మరియు వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు? ఈ ప్రశ్నలను ఈ స్టోరీ పరిశోధిస్తుందని ఆ పోస్ట్‌లో రాసుంది. ఆ పోస్ట్‌ను అభిషేక్ బచ్చన్ లైక్ చేయడంతో విడాకుల రూమర్స్‌కు ఆజ్యం పోసినట్లైంది. దీంతో నిజంగానే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications