తడిసిన అందాలతో సెగలు పుట్టిస్తున్న "ఫరియా".. హాట్ బాంబ్ అంటూ కామెంట్స్ !!
"ఫరియా అబ్దుల్లా".. 'జాతి రత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ మూవీలోని తన ప్రత్యేకమైన హైట్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఫరియాకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, రావణాసుర వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఫరియా తెలుగులో చివరిగా గతేడాది ఆ ఒక్కటీ అడక్కు, మత్తు వదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
కాగా మత్తు వదలరా 2 మూవీలో తన నటనకు గాను రీసెంట్ గానే 'గద్దర్ ఫిల్మ్ అవార్డు' సైతం గెలుచుకుంది. అలాగే ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లో ఓ సాంగ్‌లో కూడా కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఒక తమిళ చిత్రంలో నటిస్తుండగా, తెలుగులో 'గుర్రం పాపిరెడ్డి' సినిమాలో కూడా కనిపించనుంది. అలానే అల్లరి నరేష్ 61వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ భామ అందాల ఆరబోతకు తెరదీసింది.

మరోవైపు స్క్రీన్‌పై మాత్రమే కాకుండా డ్యాన్స్‌లోనూ ఫరియా టాలెంట్ చూపించింది. ముఖ్యంగా బెల్లీ డ్యాన్స్‌లో ఇరగదీసే స్థాయిలో ఉన్న ఈ బ్యూటీ, ఆహా ఓటీటీలో ప్రసారమైన 'డ్యాన్స్ ఐకాన్ 2'కి జడ్జిగా వ్యవహరించింది. ఈ షోలో ఆమె వేసిన స్టెప్పులు చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు.
సోషల్ మీడియాలో యాక్టివ్..
కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. ఎప్పటికప్పుడు తన ట్రెండీ ఫోటో షూట్స్ తో నెట్టింట రచ్చ లేపుతుంది. లేటెస్టుగా ఆమె స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతున్న ఫోటోలను షేర్ చేసింది. వైట్ సింగిల్ పీస్ స్విమ్ షూట్ లో చిట్టీ గ్లామర్ ట్రీట్ అందించింది. కొందరు నెటిజన్లు "ఏంటి చిట్టీ ఇలా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావ్?" అంటూ ఫన్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఫరియా దాదాపు ఆరు అడుగుల పొడవు ఉంటుంది. దీని వల్ల ఆమెను తక్కువ ఎత్తు ఉన్న హీరోలతో జత చేయడం కష్టమవుతోందని చాలా మంది అంటున్నారు. ఈ కారణంగానే చిత్ర నిర్మాతలు సైతం వెనక్కి తగ్గుతున్నారని కూడా భావిస్తున్నారు. మరీ ఈ పొడుగు కాళ్ల సుందరికి లక్ కలిసొచ్చి మళ్లీ ఫుల్ బిజీ అయిపోవాలని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications