Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీవారి సన్నిధిలో జాన్వీ: తోడుగా శిఖర్..

Janhvi Kapoor: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. మంగళవారం నాడు 64,552 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 19,900 మంది తలనీలాలను సమర్పించారు.

హుండీ ద్వారా 3.91 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది గంటల సమయం పట్టింది. నాలుగు కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వేసవి సెలవుల్లో రద్దీ భారీగా పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టారు.

Actress Janhvi Kapoor offered prayers at the Lord Venkateswara at Tirumala

కాగా- బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ నేడు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. పుట్టినరోజు కావడంతో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ సమయంలో ఆమె వెంట సమీప బంధువు, ఒకప్పటి స్టార్ హీరోయిన్ మహేశ్వరి, స్నేహితుడు శిఖర్ పహారియా ఉన్నారు.

ప్రస్తుతం ఆమె తెలుగులో జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ మూవీలో నటిస్తోన్నారు జాన్వీ కపూర్. ఇదే తొలి తెలుగు మూవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం ఇది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అతని సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్.. ఇతర కీలక పాత్రలను పోషించారు. కొరటాల శివ దర్శకుడు.

యువ సుధ ఆర్ట్స్, హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్.. సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి. అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోంది మూవీ. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా ఇదే. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ఎక్స్‌పెక్ట్ చేస్తోన్నారు అభిమానులు. ఇప్పటికే దేవర ఫస్ట్ లుక్ (Devara firstlook) హైప్ క్రియేట్ చేసింది. భైరవగా సైఫ్ అలీ ఖాన్ గెటప్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

దేవర ఫస్ట్ గ్లింప్సెస్‌ జనవరి 8వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. జాన్వీ బర్త్‌డే సందర్భంగా దేవర సినిమాలో ఆమె లుక్‌ను విడుదల చేసింది యూనిట్. థంగం క్యారెక్టర్‌ను పోషిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+