పెళ్లి పీటలెక్కబోతున్న హీరోయిన్ పూజా.. గురుజీతో ప్రేమయాణం
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. సినీ స్టార్స్ ఒకరి తరువాత మరొకరు వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ , హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.
ఒకప్పటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్ కూడా ఇటీవలే పెళ్లి పీటలెక్కేసింది. తాజాగా ఇదే బాటలో మరో హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుంది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు కన్నడ బ్యూటీ పూజా గాంధీ. కన్నడ సినిమా ఇండస్ట్రీలో పూజా గాంధీకి స్టార్ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం ఆమె వయస్సు 40 ఏళ్లు.

ముఖ్యంగా దండుపాళ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే. 2001లో కెరీర్ మొదలుపెట్టిన పూజా గాంధీ కన్నడ , తెలుగు, హిందీ బాషల్లో నటించింది. 50పైగా చిత్రాల్లో నటించిన పూజా కెరీర్ బీజీగా ఉన్న సయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

దీనిలో భాగంగానే తనకు కన్నడ బాష నేర్పించిన విజయ్ అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతుంది. వీరిద్దరి పరిచియం ప్రేమగా మారడంతో..అతనితోనే ఈ సీనియర్ బ్యూటీ పెళ్లి పీటలెక్కబోతుంది. ఇప్పటికే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లితో ఒకటవునున్నారు. పెళ్లి ఎప్పుడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications