Sai Pallavi: మరీ ఇంత నీచంగానా?: పెళ్లి రూమర్లపై సాయి పల్లవి అసహనం

హైదరాబాద్: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ అంటూ పిలుపించుకుంటున్న ప్రముఖ సినీ నటి సాయిపల్లవిపై ఎవరో కొందరు దుర్మార్గులు తప్పుడు ప్రచారం చేశారు. అందం, అభినయం తోపాటు అద్భుతమైన డ్యాన్స్‌లో లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న సాయిపల్లవి(Sai pallavi)కి పెళ్లైందంటూ సోషల్ మీడయాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న క్రాప్ చేసిన ఓ ఫొటో పట్టుకుని కొన్ని చిన్నచితకా మీడియా సంస్థలు ఆమెకు పెళ్లిందంటూ వార్తలు ప్రచురితం చేశాయి. ఇప్పటి వరకు తనపై వచ్చిన రూమర్లకు స్పందించని సాయిపల్లవి.. ఈ తీవ్రమైన ప్రచారంపై మాత్రం ఆగ్రహంతోపాటు అసహనం వ్యక్తం చేశారు. డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతారా? అంటూ ఆ కథనాలు ప్రచారం చేసిన వారిపై తీవ్రంగా మండిపడ్డారు.

Actress Sai Pallavi serious comments on her marriage rumours

త‌నకు పెళ్లి జరిగిందంటూ వస్తున్న రూమ‌ర్స్‌పై సాయిపల్లవి స్పందిస్తూ.. 'నిజం చెప్పాలంటే నేను రూమర్‌లను పెద్ద‌గా పట్టించుకోను, కానీ అవి కుటుంబం లాంటి నా స్నేహితుల గురించి అయిన‌ప్పుడు నేను మాట్లాడాలి. నా సినిమా పూజలో దిగిన ఒక ఫొటోనీ క్రాప్ (క‌ట్) చేసి దానిని దురుద్దేశంతో పెయిడ్ అకౌంట్స్‌ ప్రచారం చేస్తున్నాయి. నేను నా పనికి సంబంధించి మంచి విషయాలు మీతో పంచుకునప్పుడు.. ఇలాంటి పనికి మాలిన వేషాలు చూసి బాధ కలుగుతుంది. ఇలా ఇబ్బంది కలిగించడం చాలా విచారకరం' అంటూ సాయి ప‌ల్ల‌వి సోష‌ల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

సాయిపల్లవి పోస్టుపై ఆమె అభిమానులు, నెటిజెన్లు స్పందిస్తూ.. ఇటువంటి నకిలీ వార్తలను ట్రెండ్​ చేసేవాళ్లను ఊరికే వదలకూడదంటూ మండిపడుతున్నారు. ఇలాంటి వార్తలను ప్రసారం చేస్తున్న పలు మీడియా సంస్థలపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం తెలుసుకోకుండా ఏది పడితే రాయడం సరికాదంటున్నారు.

కాగా, ప్రముఖ తమిళ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి సాయి పల్లవి 'SK21' అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమాకు రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకుడు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్‌లో చిత్రబృందంతో పాటు సాయిపల్లవి, దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి కూడా మెడలో పూల దండలు వేసుకుని ఫొటోలు దిగారు.

అయితే ఈ ఫొటోలో సాయిపల్లవి, దర్శకుడిని మాత్రమే ఉంచి క్రాప్​ చేశారు. ఈ ఫొటోలతో ఆమెకు పెళ్లి జరిగిందంటూ నెట్టింట తప్పుడు ప్రచారం చేశారు. ఈ అంశంపై సినిమా యూనిట్ కూడా తీవ్రంగా స్పందించింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+