సూపర్ స్టార్‌కు తల్లిగా, చెల్లిగా, లవర్‌గా, అత్తగా నటించిన ఏకైక హీరోయిన్

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు బ్రాండ్. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఆయనకు భాషతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేవలం ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రజినీకి ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్, థాయ్ లాండ్, బ్యాంకాక్ సహా పలు దేశాల్లో సూపర్ స్టార్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో.. ప్రస్తుతం లోకేష్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే సినిమా పరిశ్రమలో కొన్ని హీరో-హీరోయిన్ల జోడీలు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ జంటల మధ్య ఉన్న కెమిస్ట్రీ, సహజ నటన ఎంతో మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటుంది. అలానే రజినీకాంత్ సరసన తల్లిగా, చెల్లిగా, ప్రేయసిగా, అత్తగా నటించిన ఒక స్టార్ హీరోయిన్ ఉన్నారు. ఒకే హీరో పక్కన విభిన్న పాత్రల్లో నటించిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరా అని జోరుగా చర్చ నడుస్తోంది.

actress-sri-vidya-play-roles-of-mother-sister-lover-aunt-with-superstar-rajini-kanth

రజినీ పక్కన విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే.. దివంగత నటి శ్రీ విద్య. చిన్న వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శ్రీ విద్య, హాస్యనటుడు కృష్ణమూర్తి, నటి వసంతకుమారి దంపతుల కుమార్తె. తండ్రిని చిన్నతనంలో కోల్పోయిన ఆమె, కుటుంబ భాధ్యతల నిమిత్తం కేవలం 14 ఏళ్లకే నటన ప్రారంభించారు. తమిళ చిత్రమైన తిరువూరుచల్వన్ ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ విద్య, రజనీకాంత్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించారు. తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన 40 సంవత్సరాల కెరీర్‌లో 800కి పైగా చిత్రాలలో నటించింది.

రజినీ సరసన నటించిన చిత్రాలు..

'అపూర్వ రాగంగల్' సినిమాలో రజనీకాంత్‌కు ప్రియురాలిగా కనిపించారు శ్రీవిద్య. ఆ తర్వాత 'మాపిళ్లై' (1989) సినిమాలో అత్తగా.. 'దళపతి' (1991)లో తల్లిగా, 'అత్తురువాలి' (1993) చిత్రంలో రజనీకాంత్‌కు చెల్లిగా నటించి మెప్పించారు. ఇలా సూపర్ స్టార్ సరసన నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించిన ఏకైక నటిగా ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+