ఎన్నో నెంబర్ బాయ్ ఫ్రెండ్.. ట్రూ లవ్ కావాలంటున్న స్టార్ హీరోయిన్
శృతి హాసన్.. కమల్ హాసన్ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని దాదాపు స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాప్ హీరోయిన్గా కొనసాగుతూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. సినిమాల పరంగానే కాకుండా పర్సనల్ విషయాలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. గతంలో మైకెల్ తో బ్రేకప్ అయ్యాక.. బాగా డిస్టర్బ్ అయిన శృతి ఆ తర్వాత శంతనుతో డేటింగ్ చేస్తుంది. వీళ్ళ లవ్ గురించి బహిరంగంగానే ఎప్పుడో చెప్పేసింది. ఇద్దరూ ముంబైలో కలిసే నివసిస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. రెగ్యులర్ గా శృతి తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన రిలేషన్ షిప్స్ పై ఓపెన్ అయ్యింది. తాను ఎలాంటి బాధ లేకుండా రిలేషన్ షిప్స్‌ను ముగించేస్తానని చెప్పి షాక్ ఇచ్చింది. తన వరకు నిజాయితీగా ఉంటానని.. అందుకే చాలా మంది తనను ఎన్నో నెంబర్ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నావంటూ ట్రోల్ చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది. అందరి విషయంలో అది కేవలం నెంబర్ మాత్రమేనని.. కానీ తన విషయంలో మాత్రం అన్ని సార్లు ప్రేమలో ఫెయిల్ అవుతున్నాను అంటే నిజమైన ప్రేమను పొందడంలో ఫెయిల్ అవుతున్నానని అర్థం అంటూ వాపోయింది.
అంతే కాకుండా తాను మనిషినే కాబట్టి కొన్ని సందర్భాల్లో కాస్త బాధపడుతానని వివరించింది. ఒకరితో కలిసి ఉన్నప్పుడు వెంటనే మారిపోవడం అనేది అంత ఈజీ కాదని వెల్లడించింది. జీవితంలో ఇలాంటి పని ఎందుకు చేశానా.. అని బాధపడిన సందర్భాలు ఎక్కువగా లేవని స్పష్టం చేసింది. కానీ కొన్నిసార్లు తనకు ఇష్టమైన వారిని బాధపెట్టానని.. అనుకోకుండా జరిగినప్పటికీ అలా చేయకుండా ఉండాల్సింది అనే భావన ఎప్పటికీ ఉంటుందని.. జీవితాంతం వారికి క్షమాపణలు చెబుతూనే ఉంటానని తెలిపింది. తన తల్లిదండ్రులు విడిపోవడం తనను ఎంతో బాధించిందని.. అప్పటివరకు ఉన్న జీవితం ఒక్కసారిగా మారిందని ఎమోషనల్ అయ్యింది.












Click it and Unblock the Notifications