విడాకులపై క్లారిటీ ఇచ్చేసిన ఐశ్వర్యరాయ్
ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి.1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్, తన అందంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది.విశ్వసుందరిగా గెలిచిన తర్వాత, ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి, తన అభినయ ప్రతిభను చాటుకుంది. ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది.
2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు.

ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ వైవాహిక జీవితంలో విభేదాలు చోటు చేసుకున్నాయని రూమర్స్ తెర మీదకు వస్తున్నాయి. అభిషేక్ బచ్చన్ లైఫ్‌లోకి మరో మహిళ రావడం వల్లే వీరి మధ్య గొడవలు జరిగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దస్వి సినిమాలో నటి నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ బచ్చన్ క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో ఐశ్వర్యరాయ్ జిరాక్ మార్కర్ అనే ఓ డాక్టర్‌తో సన్నిహితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్‌గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకున్నారు. అయితే అతను ఐశ్వర్యరాయ్ చిన్ననాటి స్నేహితుడని ఆమె సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.
విడాకులపై ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఇద్దరూ కూడా క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ముంబై ధీరుభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి అటెండ్ అవ్వడం ట్రెండింగ్‌గా మారింది. దంపతులిద్దరూ నవ్వుతూ.. హ్యాపీగా కనిపించారు. కుమార్తె ఆరాధ్య కూడా ఇదే స్కూల్‌లో చదువుతోంది.ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి దర్శనం ఇవ్వడంతో విడాకుల పుకార్లకు చెక్ పెట్టినట్టు అయింది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications