సినిమాలో ఈయన ఉంటే చాలు.. రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రావాల్సిందే..!

ఈ రోజుల్లో ఏదైనా సినిమా రూ. 1000 కోట్లు కలెక్షన్స్ రాబడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. ఏడాదికి చాలా సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. కానీ రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే సినిమాలు మాత్రం వేళ్ల మీద లెక్కించవచ్చు. అయితే బాలీవుడ్ కు చెందిన ఓ నటుడు మాత్రం వరుసగా రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. అతను ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ కన్నా..

ఇటీవల బాలీవుడ్ నటుడు అక్షయ్ కన్నా నటించిన సినిమాలు రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతున్నారు. గతేడాది డిసెంబర్ లో రణ్ వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన ధురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1500 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ మూవీలో అక్షయ్ కన్నా కీలక పాత్రలో నటించాడు. రహ్మాన్ డెకాయిట్ పాత్రలో నట విశ్వరూపం ప్రదర్శించాడు. చివరిలో రహ్మాన్ డెకాయిట్ మృతితో సినిమా పూర్తవుతుంది. ఇక ధురంధర్-2 సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఇక అంతకుముందు అక్షయ్ కన్నా ఛావా సినిమాలో నటించాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో తనలోని పూర్తి స్థాయి నటుడిని బయటికి తీశాడు అక్షయ్ కన్నా. ఈ సినిమాకు ముందు దృశ్యం 2 సినిమాలో కీలక పాత్రలో కనిపించి తన నటనతో మెప్పించాడు. ఆ సినిమా తర్వాత అతనికి అవకాశాలు భారీగా పెరిగాయి.

akshayekhanna on Fire Audiences Rave Over His Stellar Turns in Dhurandhar Chhaava Drishyam 2

ఇక ప్రస్తుతం అక్షయ్ కన్నా.. ప్రశాంత్ వర్మ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న మాకాళీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ఎప్పుడో కమిట్ అయ్యాడు కాబట్టి రెమ్యునరేషన్ విషయంలో ఆయన చాలా తక్కువ తీసుకున్నట్టుగా సమాచారం. అయితే ధురంధర్ సినిమాతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగే ఫ్యూచర్ లో మరిన్ని శక్తివంతమైన పాత్రలతో అక్షయ్ కన్నా అలరించనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+