విజయ్ దేవరకొండ తిరస్కరించిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్లే
ఏ దర్శకుడైనా, కథా రచయిత అయినా సినిమాకు కథను తయారుచేసుకునే సమయంలో ఒక హీరోను దృష్టిలో ఉంచుకొని దాన్ని తయారుచేస్తారు. తీరా ఆ కథ హీరోకు నచ్చకపోతే మరో హీరోకు చెబుతారు. అతనికి నచ్చితే ఆ హీరో బాడీలాంగ్వేజ్ కు అనుగుణంగా కథలో మార్పుచేర్పులు చేస్తారు. సినీ పరిశ్రమలో ఇది సహజంగా జరుగుతుండేదే. అయితే చాలా సందర్భాల్లో కాల్షీట్లు ఖాళీ లేకపోవడం, కథ నచ్చకపోవడం, మరికొన్ని ఇతర కారణాలవల్లో తమ దగ్గరకు వచ్చిన కథలను హీరోలు తిరస్కరిస్తుంటారు. అలా వద్దన్న సినిమాలు తర్వాత సూపర్ హిట్ అవుతాయి.. ఫ్లాప్ అయిన సందర్భాలు ఉంటాయి.
కుబేర సినిమాలో చేయనన్నారు
కథానాయకుడు విజయ్ దేవరకొండ కూడా తన దగ్గరకు వచ్చిన కొన్ని చిత్రాలను ఇలాగే వదిలేశారు. కాకపోతే అవన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమాకు విజయ్ నే హీరోగా అనుకున్నారు. అయితే విజయ్ తిరస్కరిచడంతో ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆర్ఎక్స్ 100 కథ కూడా వీడీ దగ్గరకే వచ్చింది. అయితే అర్జున్ రెడ్డి తరహా కథను పోలివుండటంతో వద్దనుకున్నారు. దీంతో కార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవడంతోపాటు బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు.

తెలుగులోనే సినిమాలు చేస్తాను
నితిన్ హీరోగా వచ్చిన భీష్మ కూడ విజయ్ చేయాల్సింది. కొన్ని కారణాలవల్ల అతను ఒప్పుకోకపోవడంతో నితిన్ తో తెరకెక్కించారు. ఉప్పెన సినిమా కూడా విజయ్ చేయాల్సింది. అయితే ఆ పాత్రకు తాను సరైన ఎంపిక అవనని దర్శకుడితో చెప్పడంతో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కి సూపర్ హిట్ అయింది. హిందీలో డాన్ 3 సినిమాలో రణవీర్ సింగ్ సరసన మరో హీరోగా అవకాశం వచ్చింది. అయితే లైగర్ ఫ్లాప్ కావడంతో తెలుగు సినిమాలపైన దృష్టి సారించాలనుకోవడంతో దాన్ని ఒప్పుకోలేదు. ఇలా సూపర్ హిట్ సినిమాలను రౌడీ హీరో వదులుకోవాల్సి వచచిది.












Click it and Unblock the Notifications