చిరంజీవికి అల్లు అర్జున్ బర్త్ డే విషెష్..ఆ ఒక్క ముక్కతో క్లోజ్..!

ఆగస్టు వచ్చిందంటే మెగా అభిమానులకు పండుగ వచ్చినట్టే. ఎందుకంటే ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. చిరంజీవి పుట్టిన రోజును మెగా అభిమానులు పండుగలా చేసుకుంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా మెగాస్టార్ బర్త్ డేను అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికి వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఒకనొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. చిరంజీవి పుట్టిన రోజ సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా ''ఇంద్ర''ను రీ రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు మెగాస్టార్ పుట్టిన కావడంతో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఆయనకు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెష్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ స్పందిస్తూ.. మన మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

allu arjun birthday wishes to megastar chiranjeevi

అయితే తనకు లైఫ్ ఇచ్చిన చిరంజీవికి సింపుల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంపై మెగా అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై అల్లు అర్జున్‌ను మెగా అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

అల్లు మాట్లాడుతూ.. 'మై డియర్‌ ఫ్యాన్స్‌.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్‌ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా.. అది మీ అందరికి తెలుసంటూ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+