అల్లు అర్జున్ మారడు.. మహేష్‌బాబుకు పోటీగా ఆ పని చేస్తున్నాడు!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారశైలిపై ఇప్పటికీ తీవ్ర విమర్శలు వస్తుంటాయి. కానీ తన యాటిట్యూడ్ ను మాత్రం మార్చుకోడు. తాను అనుకున్నదే చేసుకుంటూ వెళతాడు. ఎన్నిసార్లు మార్చుకోమని చెప్పినా అతను వినడు. వినకపోవడం అనేది అతని శైలి. మనం ఎన్నో సందర్భాల్లో అల్లు అర్జున్ యాటిట్యూడ్ ను పరిశీలించాం. తాజాగా మరోసారి మరో ప్రయత్నం చేస్తూ విమర్శలపాలవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా వాయిదా పడటంతో అట్లీ దర్శకత్వలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయాలనే యోచనలో బన్నీ ఉన్నాడు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఫారెస్ట్ లో యాక్షన్ అడ్వెంచర్ గా ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయాలనే యోచనలో రాజమౌళి ఉన్నాడు. రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? మూడు భాగాలుగా వస్తుందా? అనే విషయంలో స్పష్టత లేదు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ దీన్ని రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు అన్నీ తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ఇంతవరకు ఆయన ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. అయినా దేశవ్యాప్తంగా ప్రిన్స్ కు అభిమానులు ఉన్నారు. క్రేజ్ కూడా అదేస్థాయిలో ఉంటుంది.

అల్లు అర్జున్ కు అత్యాశ ఎక్కువ
ఎన్నిసార్లు పాన్ ఇండియా సినిమా చేయమని అడిగినప్పటికీ దర్శకులందరికీ సున్నితంగా నో చెప్పేవాడు. ఇప్పుడు ఒకేసారి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ప్రిన్స్ కు పోటీగా అల్లు అర్జున్ అట్లీతో చేసే సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పుష్ప2 హిట్ అయినంతమాత్రాన ఒకేసారి పాన్ వరల్డ్ సినిమా చేయాలంటే అందుకు తగ్గ నైపుణ్యం ఉండాలంటూ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ప్రతి హీరోను అధిగమించి తానే నెంబర్ వన్ హీరోగా నిలవాలనే అత్యాశ అల్లు అర్జున్ కు ఉందని, అది ఎట్టి పరిస్థితుల్లోను కుదరదంటూ ప్రిన్స్ అభిమానులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు.












Click it and Unblock the Notifications