Allu Arjun Raaka: అల్లు అర్జున్ 'రాకా' రిలీజ్ డేట్ ఫిక్స్..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నాన్ బాహుబలి రికార్డుల్ని కొల్లగొట్టింది. అంతేకాక బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ లో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. అయితే పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో 'రాకా' అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినీ ప్రేక్షకులు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'రాకా' కూడా ఒకటి కావడం విశేషం.
రాకా మూవీ నుంచి ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ పూర్తిగా డిఫరెంట్ గెటప్ లో కనిపించి ఆశ్చర్య పరిచారు. గుండు లుక్, భారీ గోర్లు, బీస్ట్ స్టైల్ అపీరెన్స్ తో బన్నీ పూర్తిగా కొత్త అవతారంలోకి మారిపోయారు . 'ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. మీ ఊహలకు మించి సినిమా ఉంటుంది' అంటూ చిత్రబృందం ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై మరింత హైప్ ను పెంచేసింది. అయితే ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రాకా మూవీ 2028, జనవరి 26న విడుదల కానున్నట్లు నెట్టింట ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ మేరకు మూవీ అధికారిక వెబ్ సైట్ లో పోస్టు చేసినట్లు సమాచారం.
🚨 𝐒𝐇𝐎𝐂𝐊𝐈𝐍𝐆 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 🚨
— Movies Buster (@buster_movies) September 4, 2026
Allu Arjun’s #𝐑𝐀𝐀𝐊𝐀 Is 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋𝐋Y Set For 𝟐𝟔𝐓𝐇 𝐉𝐀𝐍𝐔𝐀𝐑𝐘 𝟐𝟎𝟐8 Release🗓️❤️🔥❤️🔥!
Targeting A 𝟓-𝐃𝐀𝐘 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃 𝐑𝐄𝐏𝐔𝐁𝐋𝐈𝐂 𝐃𝐀𝐘 𝐖𝐄𝐄𝐊𝐄𝐍𝐃 🥁, The Film Has Announced Its Release Date Via Its… pic.twitter.com/ldGV5jN8tq
అంటే ఈ మూవీ రిలీజ్ కు ఇంకా 508 రోజులు ఉన్నట్లు కౌంట్ డౌన్ ను పెట్టింది చిత్ర యూనిట్. ఐదు రోజుల భారీ రిపబ్లిక్ డే వీకెండ్ తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఆత్రుతతో ఉన్నారు. ఇక సన్ పిక్చర్స్ బ్యానర్ పై రాకా మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోంది. దాదాపు రూ. 800 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్, అత్యాధునిక వీఎఫ్ ఎక్స్ తో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ మెంట్ వీడియో చూస్తే మనకు అర్థం అవుతోంది.

రాకా చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక రాకా మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ వంటి నలుగురు అగ్ర కథానాయికలు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు.












Click it and Unblock the Notifications