బన్నీ, సందీప్ రెడ్డి వంగా మూవీ ఫిక్స్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పుష్ప 2 మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ మూవీ చేస్తున్నారు బన్నీ. ఇటీవల కోలీవుడ్ కు చెందిన మరో స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తోనూ ఓ మూవీ చేయనున్నారు అల్లు అర్జున్. ఇందుకు సంబంధించిన గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. అయితే ఇప్పుడు మరో వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో బన్నీ ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. తాజాగా ఈ క్రేజీ కాంబో కన్ఫామ్ అయినట్టు సమాచారం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున వరుసగా భారీ మూవీస్ తో దూసుకెళ్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌- తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో ఓ సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ కాంబోలో సినిమాను కన్ఫార్మ్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్​ను మేకర్స్​ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఈ ఏడాదే ఈ ప్రాజెక్ట్​ పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించనున్నారు.

అయితే ప్రస్తుతం మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్- సందీప్ రెడ్డి వంగా కాంబో ఓకే అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5 న విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించనున్నట్లు సమాచారం.

AlluArjun with Sandeep Reddy Vanga Explosive Collaboration Movie in the Works Latest Buzz

ఇక సందీప్ రెడ్డి వంగా సినిమాలు చూస్తే.. రా అండ్ రస్టిక్, బోల్డ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. విమర్శకులతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. బాక్సాఫీస్ వద్ద అవి బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నాయి. ఆయన దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలు ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీ కూడా ఇలాంటి కోవకు చెందినది గానే భావించవచ్చు. మరి సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్ కాంబో లో మూవీ ఎలా ఉంటుందో చూడాలి. స్పిరిట్ తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+