అన్ని చోట్లా హౌస్ ఫుల్స్.. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది!

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మించిన రా అండ్ రస్టిక్ మూవీ 'అనకాపల్లి'. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరించగా.. త్రినాథరావు నక్కి స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఘనంగా థాంక్యూ మీట్ నిర్వహించారు.

'కోర్ట్' బ్యూటీ శ్రీదేవి కొత్త సినిమా ట్రైలర్ చూశారా..? 'కోర్ట్' కు మించిన సస్పెన్స్..!
'కోర్ట్' బ్యూటీ శ్రీదేవి కొత్త సినిమా ట్రైలర్ చూశారా..? 'కోర్ట్' కు మించిన సస్పెన్స్..!

దసరా ధమాకా నిలుస్తుంది: లగడపాటి శ్రీధర్
ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. విక్రమ్ తన కొడుకు కావడం, అతనితో సినిమా చేయడానికి త్రినాథ్ రావు, నాయుడు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇలాంటి చిన్న సినిమా మీడియా ఎప్పుడూ ముందుండి సపోర్ట్ చేస్తుందని తెలిపారు. గతంలో తన 'ఎవడిగోలవాడిదే' సినిమాను మొదటి వారంలోనే తీసేస్తారన్నారని.. కానీ అదే థియేటర్లో ఆ చిత్రం సిల్వర్ జూబ్లీ జరుపుకుందని గుర్తుచేశారు. ఈ దసరా ధమాకాగా 'అనకాపల్లి' కూడా గొప్ప విజయం సాధిస్తుందని, మండే నైట్ షోలు కూడా హౌస్ ఫుల్స్ అయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు.

Anakapalli Movie Thank You Meet Housefull Shows and Dasara Success producers and cast celebrate housefull shows

అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి: త్రినాథరావు నక్కిన
నటుడు, నిర్మాత, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ఈ చిత్రానికి తాను ఎలాంటి పెట్టుబడి పెట్టలేదని, తన పేరు వల్లే ప్రేక్షకులు చూస్తారనే ఉద్దేశంతో అలా పెట్టారని స్పష్టం చేశారు. సోమవారంతో పాటు మంగళవారం కూడా మంచి ఫ్లోటింగ్ ఉందని.. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయని పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో ఆర్టిస్టులందరికీ మంచి పేరు వస్తోందని, ఇదే జోరును కొనసాగించేలా మీడియా, ప్రేక్షకులు సహకరించాలని కోరారు.

సరైన థియేటర్లు ఇవ్వకపోవడం బాధాకరం: నటి ఇంద్రజ
నటి ఇంద్రజ మాట్లాడుతూ.. ఈ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారని, అసలు సిసలు విజయాన్ని ఈ చిత్రం సాధించిందని వెల్లడించారు. అయితే ఇంత మంచి సినిమాకు సరైన సంఖ్యలో థియేటర్లు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. సినిమాలో ఎవరున్నారు అనే దానికంటే కంటెంటే ముఖ్యమని ప్రేక్షకులు నిరూపిస్తున్నారని, ఓటీటీలో చూద్దామనుకుంటే థియేటర్‌లో మిస్ అయ్యామనే ఫీల్ కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.

రామ్ చరణ్– సుకుమార్ సినిమా లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
రామ్ చరణ్– సుకుమార్ సినిమా లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!

నిర్మాతల ఆవేదన
నిర్మాత కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ.. త్రినాథరావు నక్కినపై ఉన్న నమ్మకంతో రెండు వందల థియేటర్లలో సినిమాను విడుదల చేశామని, మంచి సినిమాలకు కాకుండా ఇతర భాషల చిత్రాలకు థియేటర్లు ఇవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ హౌస్ ఫుల్స్ పడుతున్న ఈ చిత్రానికి మరిన్ని థియేటర్లు కేటాయించాలని డిస్ట్రిబ్యూటర్లను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+