Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారంలో మూడుసార్లు చేసేందుకు ట్రై చేస్తా : అనసూయ

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. వివాదాలతో కూడా నిత్యం సహవాసం చేస్తూనే ఉంది.అనసూయ ఏం చేసిన, ఏం మాట్లాడిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది.

జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

anasuya interact with fans on online

సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీర కట్టిన, స్కార్ట్ వేసిన అది అనసూయకే చెల్లింది. అందం,నటనతో చాలామంది అభిమానులను సంపాధించుకున్న అనసూయ.

అమ్మడు అందాలకు సోషల్ మీడియా సైతం అల్లాడిపోతుంది. అయితే ఇటీవల అనసూయ కాస్తా బొద్దుగా కనిపిస్తోంది. దీంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.తాజాగా అభిమానులతో ముచ్చటించిన అనసూయ దీనిపై స్పందించారు.మీరు డైలీ జిమ్ చేస్తారన్న ప్రశ్నకు.. రోజూ జిమ్ చేయాలని నాకు ఉంటుంది కానీ.. ఇప్పుడున్న నా షెడ్యూల్స్ కి అసలు టైం కుదరడం లేదు.. వారానికి మూడు సార్లు ఖచ్చితంగా జిమ్ చేసేందుకు ట్రై చేస్తా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+