నెమలి హొయలకన్నా.. సెలయేటి లయలకన్నా.. నీ జిలిబిలి నడకలే..!!
మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో, అందంతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంటోంది. సినిమా షూటింగ్ జరిగే సమయంలో సెట్ లో అందరితోను కలిసిపోయి సరదాగా ఉంటుంది. తను ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.'అఆ' సినిమాలో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, రాక్షసుడు, కార్తికేయ-2 వంటి చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలతోనే స్టార్ హీరోయిన్ గా మారింది. రెండు సంవత్సరాల క్రితం కార్తికేయ2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాదు ప్రస్తుతం చేతిలో నాలుగు ప్రాజెక్టులు పెట్టుకొని మంచి జోరుమీద ఉంది. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈగల్ సినిమాలో ఒక కీలక పాత్రలో మెరవబోతోందని తెలుగు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

సాంప్రదాయబద్దమైన పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న అనుపమ తాజాగా టిల్లు స్క్వేర్ లో నటించింది. ఇందులో ఎంతో బోల్డ్ గా నటించడమేకాదు.. రొమాన్స్ లో రెచ్చిపోయిందంటున్నారు. లిప్ లాక్స్ తో తనలో ఉన్న కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. సోషల్ మీడియాలో అనుపమకు లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కోసారి అనుమప పోస్ట్ చేసే ఫొటోలను చూసి అభిమానులు, నెటిజన్లు హాట్ హాట్ కామెంట్స్ పెడుతుంటారు.

తాజాగా కొన్ని గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేసింది. కుర్రాళ్లను టెంప్ట్ చేసే ఈ ఫొటోలను షేర్ చేస్తూ నీగురించి ఏదైనా నన్ను ప్రమాదకరమైన మహిళగా భావించేలా చేస్తుందని కామెంట్ చేసింది. ప్రస్తుతం అనుపమ చేసిన లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలే వైరల్ గా మారడంతోపాటు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. టిల్లు స్క్వేర్ చిత్రంతో రొమాన్స్ పరంగా రెచ్చిపోయిన అనుపమ భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో తనలోని రొమాంటిక్ యాంగిల్ ను పరిచయం చేస్తుందంటున్నారు. ఆమె అభిమానులు కూడా అదే ఆశతో ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications