చిన్న సినిమా పెద్ద హిట్ ఇదే..!
విజయ రామరాజు కథానాయకుడిగా విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా 'అర్జున్ చక్రవర్తి' ఘన విజయం సాధించింది. ఈ చిత్రం 46 అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డులను గెలుచుకొని, ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సక్సెస్ నేపథ్యంలో చిత్ర బృందం థాంక్ యూ మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. 'అర్జున్ చక్రవర్తి'కి వస్తున్న అద్భుతమైన స్పందన సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇంకా సినిమా చూడని వారు థియేటర్లకు వెళ్లి ప్రోత్సహించాలని కోరారు. ప్రేక్షకుల ఆదరణ ఉంటేనే ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని వస్తాయని చెప్పారు. ఈ సినిమా కోసం ఆరేళ్లు కష్టపడిన హీరో విజయ రామరాజు, రాజీ పడకుండా సినిమా నిర్మించిన నిర్మాత శ్రీని గుబ్బలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కథానాయకుడు విజయ రామరాజు మాట్లాడుతూ.. తమ ఆరేళ్ల కష్టానికి దక్కిన అద్భుతమైన ప్రతిఫలం ఈ విజయమని ఆనందం వ్యక్తం చేశారు. దర్శక, నిర్మాతలకు, అలాగే సపోర్ట్ చేసిన సినీ ప్రముఖులు హను రాఘవపూడి, వెట్రిమారన్, అడివి శేష్, సంపత్ నందిలకు ధన్యవాదాలు తెలిపారు. తన నటనకు క్రెడిట్ అంతా దర్శకుడికే దక్కుతుందన్నారు.
హీరోయిన్ సిజా రోజ్ మాట్లాడుతూ.. తన తొలి తెలుగు సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. నటుడు దయానంద్ రెడ్డి మాట్లాడుతూ.. తాను నటించిన వంద సినిమాల్లో 'అర్జున్ చక్రవర్తి' ప్రత్యేకమైన చిత్రమని, రంగయ్య పాత్ర తన కెరీర్‌లో నిలిచిపోతుందని చెప్పారు. సినిమా విజయంపై చిత్ర బృందం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రేక్షకుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది.












Click it and Unblock the Notifications