Bigg Boss 9: తొలి ఎలిమినేషన్ ఆమె.. 'బ్యాక్ బిచ్చింగ్' అంటూ దారుణంగా
బిగ్‌బాస్-9 సీజన్ అనూహ్యమైన మలుపులతో ప్రారంభమైంది. ఈసారి 'చదరంగం కాదు రణరంగం' అన్నట్లుగా, 9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులతో షో మరింత ఉత్కంఠభరితంగా మారింది. నాగార్జున ఇచ్చిన కొత్త టాస్క్‌లు , నిబంధనలు హౌస్‌మేట్స్‌ను ఆశ్చర్యానికి గురిచేశాయి.
లగ్జరీ హౌస్‌లో సామాన్యులను ఉంచి, అవుట్‌హౌస్‌లో ఎటువంటి సౌకర్యాలు లేకుండా సెలబ్రిటీలను ఉంచడం మొదటి షాక్. అంతేకాకుండా, సెలబ్రిటీలతో సామాన్యులు పనులు చేయించడం, ప్రధాన హౌస్‌లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించడం వంటివి షోకు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి.

ఇక రెండో రోజు నుంచే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవ్వడంతో షోలో హీట్ పెరిగిపోయింది. సామాన్యులకు బిగ్‌బాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ వల్ల సెలబ్రిటీలు కంగుతిన్నారు. సామాన్యులందరూ కలిసి ఒక సెలబ్రిటీని నామినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పగా, 'బుజ్జిగాడు' సినిమాలో నటించిన సంజనాను నామినేట్ చేశారు. ఈ నామినేషన్ సందర్భంగా సంజనా , ఇతర కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది.
'బ్యాక్ బిచ్చింగ్'(ఒక వ్యక్తి గురించి వారు లేనప్పుడు లేదా వారికి తెలియకుండా వెనుక మాట్లాడటం) వంటి పదాలు వాడటంతో సంజనా ఫైర్ అయ్యారు. ఇది మొదటి వారమే షోలో పెద్ద గొడవకు దారితీసింది. గత సీజన్లలో మొదటి వారంలో వంట చేసిన వారు ఎలిమినేట్ అయిన చరిత్ర ఉండగా, ఇప్పుడు సంజనా విషయంలో కూడా అదే జరగవచ్చని నెటిజన్లు ఊహిస్తున్నారు. ఈ పరిణామాలు ఈ సీజన్‌కు మరింత ఉత్సాహాన్ని అందించాయి.












Click it and Unblock the Notifications