Bigg Boss 9: శ్రష్టి వర్మ వారం రోజులకు ఎంత తీసుకుందో తెలుసా..?
బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా మొదలైంది. సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ షో, తొలి వారం పూర్తి కాకముందే ఎలిమినేషన్ సెషన్‌తో ఉత్కంఠను పెంచింది. ఊహించని విధంగా, మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లారు.
జానీ మాస్టర్‌పై సంచలన ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన శ్రష్టి, బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఆట ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, హౌస్‌లో ఆమె ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. టాస్కుల్లో చురుకుగా పాల్గొనకపోవడం, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం ఆమెకు ప్రతికూలంగా మారింది. ఓటింగ్‌లో కూడా వెనుకబడి, చివరకు తొలి ఎలిమినేషన్ బాధితురాలిగా నిలిచారు.

కేవలం వారం రోజుల బిగ్ బాస్ జర్నీలోనే శ్రష్టి వర్మ తన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. దీంతో ఆమె ప్రయాణం తొందరగానే ముగిసిందని చెప్పవచ్చు. అయితే, కేవలం ఏడు రోజులపాటు హౌస్‌లో ఉన్నప్పటికీ, శ్రష్టి వర్మకు రెండు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం. ఇది బిగ్ బాస్ సీజన్‌లలో చాలా సాధారణం. ప్రతి కంటెస్టెంట్‌కు వారానికి ఒక నిర్ణీత మొత్తం చెల్లిస్తారు. శ్రష్టి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ 9 మరింత ఆసక్తికరంగా మారనుంది. తదుపరి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.












Click it and Unblock the Notifications