Big Boss 9 : మూడో వారం టాప్ కంటెస్ట్ అవుట్..ఎవరూ ఊహించి ఉండరు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9... ఈ సీజన్ మొదట్నుంచీ బిగ్ బాస్ చెబుతున్నట్టుగానే "అనూహ్య పరిణామాలు, ట్విస్టులు" హౌస్‌లో మూడో వారం నుంచే మొదలయ్యాయి! ఇప్పటికే మొదటి వారం శ్రష్టి వర్మ, రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ కాగా, ఇప్పుడు మూడో వారం ఎలిమినేషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మూడో వారంలో నామినేట్ అయిన పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, హరిత హరీష్, రీతూ చౌదరీ, ఫ్లోరా సైనీ, రాము రాథోడ్ లలో.. ఓటింగ్ సరళి ప్రకారం ప్రియా శెట్టి హౌస్‌ను వీడనున్నట్లు సమాచారం.గత వారం తృటిలో తప్పించుకున్న ప్రియ, ఈసారి మాత్రం తక్కువ ఓటింగ్ కారణంగా ఎలిమినేట్ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కామనర్‌గా ఉన్న ప్రియా శెట్టి నిష్క్రమణ... ఆమెకు క్లోజ్‌గా ఉన్న శ్రీజ , పవన్ కళ్యాణ్‌కు పెద్ద షాక్ అనే చెప్పొచ్చు.

హౌస్‌లో ఎక్కువగా హడావుడి చేయటం, శ్రీజతో ముచ్చట్లు పెట్టడం తప్ప, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆమె టాస్క్‌లు ఆడలేదనే అభిప్రాయం ఉంది.గత వారం కెప్టెన్సీ సమయంలో ఇమ్మాన్యుయెల్ విషయంలో తప్పుడు జడ్జ్‌మెంట్ ఇవ్వడం కూడా ఓటింగ్‌పై ప్రభావం చూపింది.సెలబ్రిటీలతో పోలిస్తే కామనర్‌లకు ఆడియెన్స్‌లో ఫాలోయింగ్ తక్కువగా ఉండటం, పీఆర్ సపోర్ట్ లేకపోవడం కూడా ఓటింగ్ తగ్గడానికి కారణమని తెలుస్తోంది.ప్రియా శెట్టితో పాటు హరిత హరీష్ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారని, ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే హరిత నిష్క్రమించే అవకాశం ఉందని సమాచారం.
రాము రాథోడ్ ఓటింగ్‌లో టాప్‌లో ఉండి తనకున్న ఫాలోయింగ్‌ను నిరూపించుకున్నాడు.హౌస్‌లో సైలెంట్‌గా, బోరింగ్‌గా ఉందంటూ కామెంట్లు ఎదుర్కొని జైలుకు వెళ్లినప్పటికీ, ప్రేక్షకుల నుంచి మంచి ఓటింగ్ అందుకుని టాప్ 2 లో నిలిచింది. రీతూ చౌదరీ ప్రారంభంలో ఓటింగ్ ప్రభావం నెమ్మదించినా, ఇటీవల కాంట్రవర్సీల కారణంగా పుంజుకుని మూడో స్థానంలో ఉంది. బిగ్ బాస్ ఈ సీజన్ ట్విస్టుల విషయంలో తగ్గేదేలే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
బిగ్ బాస్ మొదట సంజనను సీక్రెట్ రూమ్‌కి పంపించినప్పటికీ, నాగార్జున ఆమెను ఎలిమినేట్ చేయడం ద్వారా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.సంజన స్థానంలో కామనర్ దివ్యను హౌస్‌లోకి పంపించి, ఆమె ద్వారా సంజన ఎలిమినేషన్ చేయించడం గమనార్హం. ఐదో వారంలో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు, అందులో ఎక్కువ మంది టీవీ ఆర్టిస్టులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సమాచారం ఈ సీజన్‌పై ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications