బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ లీక్ ..ఈసారి రచ్చ రచ్చే..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం అభిమానుల ఎదురుచూపులు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే అగ్ని పరీక్ష పేరిట సామాన్యులను హౌస్‌లోకి తీసుకు రావడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. ఈ సీజన్ గతానికి భిన్నంగా ఉండబోతుందని స్పష్టం అవుతోంది. కంటెస్టెంట్లను
రెండు హౌస్‌లను ఉంచే యోచనలో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది.
సాధారణంగానే బిగ్ బాస్ అంటే ఒక ఉత్కంఠ, ఎన్నో మలుపులు, అనూహ్య ఘటనలు. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక లిస్ట్ ఈ సీజన్‌పై అంచనాలను రెట్టింపు చేస్తోంది.ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న సెలబ్రిటీలంటూ కొన్ని పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. వాటిలో సినిమా తారలు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, కమెడియన్లు ఉన్నట్లు సమాచారం.

ఈసారి కంటెస్టెంట్ల లిస్ట్‌లో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్, సీరియల్ హీరోయిన్లు తేజస్విని, కావ్యశ్రీ, దేబ్జాని, నవ్య స్వామి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ పేరు కూడా ఈ సారి బిగ్ బాస్ లిస్ట్‌లో కనిపిస్తోంది. సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ లవర్ శివకుమార్, బ్రహ్మముడి హీరోయిన్ దీపిక కూడా ఈ సీజన్లో కనిపించే అవకాశం ఉంది.
తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న రీతు చౌదరి సైతం ఈ సీజన్‌లో కనిపిస్తుందని సమాచారం.ఇక మై విలేజ్ షోతో క్రేజ్ సంపాదించిన అనిల్ గీలా,సినిమాల్లో కనిపించే ఛత్రపతి శేఖర్, ఒకప్పుడు హీరోగా చేసి, ఇప్పుడు సీరియల్స్‌లో నటిస్తోన్న సాయికిరణ్ కూడా సీజన్ 9లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. వీరితో పాటు మరికొందరు పేర్లు సైతం ఈ సీజన్‌లో వినిపిస్తున్నాయి. ఈ జాబితా నిజమైతే, ఈ సీజన్ గతంలో కంటే మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం. గ్లామర్, వినోదం, డ్రామా కలగలిసి ప్రేక్షకులను కట్టిపడేయడానికి సిద్ధంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications