కిస్ సీన్ కోసం 37 టేక్స్ తీసుకున్న యంగ్ స్టార్ హీరో..

సినిమా కోసం నటీనటులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఎవరికి వారు తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలనే తాపత్రయంతో ప్రతి షాక్ కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. మూవీ విషయానికి వస్తే యాక్షన్ సీన్స్, సాంగ్స్ ఒక ఎత్తు అయితే.. రొమాంటిక్ సీన్స్ మరో ఎత్తు. ప్రెజెంట్ డేస్ లో రొమాంటిక్ సీన్స్ సినిమాపై ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో అందరికీ తెలిసిన విషయమే. ఇక నటీనటులు కూడా రొమాంటిక్ సీన్స్ విషయాల్లో కొంచెం అప్డేట్ అవుతూనే ఉంటున్నారు.

ఒకప్పుడు రొమాన్స్ అంటే పూలు, కొండలు, పక్షులు ఇలా చూపించేవారు. కానీ ఇప్పుడు ముద్దు సీన్లలో కూడా రెచ్చిపోయి నటించేస్తున్నారు. అయితే ఓ యంగ్ స్టార్ హీరో మాత్రం ముద్దు సీన్ కోసం ఏకంగా 37 టేకులు తీసుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అతనే బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్.

Bollywood young star hero took 37 takes for kiss scene who is he

కార్తీక ఆర్యన్ నటించిన సినిమాల్లో కాంచీ ది అన్‌బ్రేకబుల్ అనే మూవీ ఒకటి. మిష్టి ఈ మూవీలో హీరోయిన్‌గా నటించింది. సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2014లో రిలీజ్ అయ్యింది. దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, రిషి కపూర్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ హీరో ఈ మూవీ విషగేశాల గురించి నోరువిప్పాడు.

కాంచీ మూవీ షూటింగ్ లోని ఓ ముద్దు సీన్ కోసం బాగా ఇబ్బందిపడ్డానని కార్తీక ఆర్యన్ చెప్పారు. డైరెక్టర్ ప్యాషనేట్ కిస్ కావాలని చెప్పారట.. కానీ తనకు కిస్ సీన్స్ లో యాక్ట్ చేసిన అనుభవం లేకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొన్నానని తెలిపారు. సీన్ విషయంలో డైరెక్టర్ కాంప్రమైజ్ కాకపోవడంతో.. ఆ ముద్దు సీన్ కోసం ఏకంగా 37 టేకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఒకానొక సిచ్యుయేషన్ లో.. డైరెక్టర్ ని ముద్దు ఎలా పెట్టాలో కాస్త చూపిస్తారా అని అడగాలని కూడా అనుకున్నానాన్నారు.

అంతే కాకుండా కిస్సింగ్ సీన్‌లో మిష్టి కావాలనే తప్పులు చేసి ఉండొచ్చని కార్తీక్ సరదాగా జోక్ చేశారు. ఇక ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ నటించిన సోనుకే టిటుకి స్వీటీ, లుకా చుప్పి, భూల్ భులయ్యా 2 లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+